కరోనా కారణంగా అన్ని పనులు స్తంభించిపోయాయి. వైరస్ ధాటికి ప్రపంచ ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనదేశంలో ఈ వైరస్ దాడి రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. కేసులు పెరుగుతున్నాయి. రోగులు పెరుగుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇలానే ఉంటుందో అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రతీ ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారు. ఐతే ప్రస్తుతం మనం అన్ లాక్ దశలో ఉన్నాం.
ఒక్కొక్కటిగా అన్ లాక్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే చాలా మటుకు అన్నీ ఓపెన్ అయ్యాయి. ఇక మిగిలింది స్కూల్స్ , థియేటర్లు, ఇంకా కొన్ని జనాలు గుంపుగా కలిసేవి మాత్రమే. సెప్టెంబర్ నుండి ఇవన్నీ కూడా తెరుచుకోనున్నట్టు వినిపిస్తుంది. అదలా ఉంచితే తాజాగా నీట్ ఎగ్జామ్స్ విషయమై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. కరోనా టైమ్ లో దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించడం కరెక్ట్ కాదనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఈ మేరకు చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, నీట్ ఎగ్జామ్స్ విషయమై తన విన్నపాన్ని వినూత్నంగా తెలియజేసారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన సీతక్క, ప్రధాని మోదీ గారు పక్షులకి ఫోటో తీస్తున్నటు వంటి ఫోటోని పోస్ట్ చేస్తూ, కెమెరా లెన్స్ ని పక్షులకి పెట్టడం కాదు కొంచెం పక్కకి తిరిగి విద్యార్థులు ఏమంటున్నారో, వారి డిమాండ్లు ఏంటో తెలుసుకోండి సార్ అంటూ పోస్ట్ పెట్టారు.