మారిన ఎన్‌పీఎస్ నిబంధనలు.. అకౌంట్ తెరిస్తే రూ.10 వేల వరకు కమిషన్…!

నేషనల్ పెన్షన్ స్కీమ్ రూల్స్ ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ మార్చడం జరిగింది. ఇక మరి ఆ రూల్స్ గురించి చూస్తే.. ఇప్పుడు పాయింట్ ఆఫ్ ప్రజెన్స్ ఎన్‌పీఎస్ అకౌంట్ ఓపెన్ చేస్తే కమిషన్ వస్తుంది. పూర్తి వివరాలలోకి వెళితే..

పీఓపీలుగా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వంటి సంస్థలు వున్నాయి. అయితే ఇవి ప్రజలకి సాయం చేయచ్చు. వారి కోసం రిజిస్ట్రేషన్ చెయ్యచ్చు. అలానే ఇతర ప్రయోజనాలను కూడా సబ్‌స్క్రయిబర్లకు కల్పించచ్చు. పీఓపీలకు కనీసం రూ.15 నుంచి గరిష్టంగా రూ.10 వేల వరకు కమిషన్ రానుంది.

సెప్టెంబర్ 1, 2022 నుంచి పీఓపీలకు కమిషన్ రానుంది. ఎన్‌పీఎస్ డీరెమిట్ కంట్రిబ్యూషన్‌ మొత్తం లో ఈ కమిషన్ 0.20 శాతంగా ఉండనుంది. ఈ కొత్త రూల్స్ వలన పీఓపీలకు హెల్ప్ అవుతోంది. అకౌంట్ ని ఓపెన్ చెయ్యడానికి ప్రయత్నం చేయడం మరియు సొంత వనరులను కూడా వాడుతూ కొత్త అకౌంట్లను ఓపెన్ చెయ్యడం కోసం సహకరిస్తారని అంది.

‘ఆల్ సిటిజన్ మోడల్’ కింద డైరెక్ట్ రెమిట్ సౌకర్యం ద్వారా సంబంధిత సంస్థకు ప్రజలు వారి అకౌంట్ నుండి డబ్బులని ట్రాన్స్ఫర్ చేస్తే ఈ కమిషన్ పీఓపీలకు వస్తుంది. డీ-రెమిట్ ద్వారా కనీసం రూ.500ను కంట్రిబ్యూట్ చెయ్యాలి. ఇక ఇది ఇలా ఉంటే NPS అనేది సోషల్ సెక్యూరిటీ కార్యక్రమం. 2004లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ని తీసుకు వచ్చారు.