సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పదవీ విరమణ చేయడంతో.. నేడు నూతన సీజేఐగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , లలిత్ చే ప్రమాణ స్వీకారం చేయించారు. 49వ సీజేఐగా లలిత్ బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 65 ఏళ్ల వయస్సు వరకు కొనసాగుతారు. ఈ క్రమంలో లలిత్ పదవీకాలం నవంబర్ వరకు మాత్రమేమే ఉంది. అంటే ఆయన 74 రోజులు మాత్రమే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు.
రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. జస్టిస్ మయూ లలిత్ మహారాష్ట్రకు చెందినవారు. జూన్ 1983లో న్యాయవాద వృత్తిని ప్రారంభించి.. డిసెంబర్ 19డిసెంబర్ 1985 వరకు బాంబే హైకోర్టులో పనిచేశారు. 2014లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.