మీ పాన్ కార్డు పోయిందా? ఇలా చేస్తే కొత్త కార్డు వచ్చేస్తుంది..!

-

ఇప్పుడు ఎటువంటి లావాదేవీలు చెయ్యాలని అనుకున్నా కూడా పాన్ కార్డు తప్పనిసరి..పాన్ లేకుండా ఎటువంటి చెల్లింపులు చెయ్యలేము..ఇన్కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌ జారీ చేస్తుంది..బ్యాంకు ఖాతా తెరవడం, పెట్టుబడి పెట్టడం, లావాదేవీలు చేయడం మొదలైన వాటికి పాన్‌ కార్డు తప్పనిసరిగా అవసరమయ్యే డాక్యుమెంట్‌.పాన్ కార్డ్’ అనేది బ్యాంకింగ్, ఆర్థిక సంబంధమైన వ్యవహారులు నిర్వహించేందుకు అతి కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటి అనే విషయం అందరికి తెలిసిందే..

ఏ రకమైన ఆర్థిక కార్యకలాపాలనూ నిర్వహించేందుకు వీలు కాదు. అయితే వినియోగదారులు తప్పనిసరిగా చాలా చోట్ల పాన్ కార్డ్ వివరాలను అందించాల్సి ఉంటుంది. అయతే మీ పాన్ కార్డ్ పోయినా, దొంగిలించబడినా లేదా పాడైపోయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు..మీరు మళ్ళీ కార్డును ఆన్లైన్ ద్వారా పొందవచ్చు..ఎలా అప్లై చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కార్డు వివరాల్లో ఎలాంటి మార్పు లేకుంటే మాత్రమే రీప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సదుపాయాన్ని NSDL e-Gov ద్వారా ఇటీవల PAN అప్లికేషన్ ద్వారా ప్రాసెస్ చేసిన లేదా ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో తక్షణ e-PAN సదుపాయాన్ని ఉపయోగించి PAN పొందిన కార్డ్ హోల్డర్‌లు మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది.

ముందుగా https://www.onlineservices.nsdl.com/paam/ReprintEPan.html లింక్ పై క్లిక్ చేయాలి.అందులో కనిపించే వివరాలను నమోదు చేయాలి. మీరు పాన్ నంబర్, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ మొదలైన వివరాలను పూరించాలి. కార్డ్‌ని మళ్లీ ముద్రించడానికి ఆధార్ వివరాలను ఉపయోగించడానికి దరఖాస్తుదారు సమ్మతి ఇవ్వాలి..చివరగా ఒక కోడ్ వస్తుంది..దాన్ని ఎంటర్ చెయ్యాలి..పాన్ కార్డ్ రీప్రింట్, మీ ఇంటికి డెలివరీ చేయడానికి మీరు కొంత రుసుము చెల్లించాలి. ఫారం నింపిన తర్వాత ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. భారతదేశంలో కార్డును డెలివరీ చేయడానికి రూ.50 రుసుము చెల్లించాలి..అంతే పాన్ కార్డు మీ ఇంటికి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news