మ‌రో వివాదంలో కేసీఆర్‌… చిన‌జీయ‌ర్ ఆగ్ర‌హం…?

-

యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ఇష్టానుసారంగా జ‌రుగుతున్నాయ‌నే వార్త‌లు భ‌క్తుల్లో ఆందోళ‌నకు గురిచేస్తున్నాయి. మూల‌విరాట్టును తాక‌డ‌మే కాకుండా ఇన్నాళ్లుగా భ‌క్తుల‌కు శాంతామూర్తిగా ద‌ర్శ‌న‌మిచ్చిన న‌ర‌సింహ‌స్వామిని ఉగ్ర నర‌సింహుడిగా విగ్ర‌హ ఆకారంలోకి మార్పు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. వాస్త‌వానికి ఆగ‌మశాస్త్ర నిపుణులు సూచించిన ప్ర‌కారం ఆల‌య నిర్మాణం జ‌రుగుతుంద‌ని, ఇందులో ఎలాంటి సందేహాలు పెట్టుకోవ‌ద్ద‌ని సీఎం కేసీఆర్ మీడియా ముఖంగా భ‌క్తుల‌కు హామీ ఇచ్చారు.

అయితే ప‌నులు నిర్వ‌హిస్తున్న శిల్పులు, ఆర్కిటెక్‌లు అస‌లు ఆల‌య ప్ర‌ధానా అర్చ‌కుల స‌ల‌హాలు గాని, ఆగ‌మ శాస్త్ర నిపుణుల సూచ‌న‌లుగాని ఏమాత్రం ప‌ట్టించుకోకుండా త‌మ ఇష్టానుసారంగా పునర్నిర్మాణ ప‌నులను కొన‌సాగిస్తున్నారంటూ భ‌క్తులు మండిప‌డుతున్నారు. ఇదే విష‌యం మీడియా క‌థ‌నాల్లో రావ‌డంతో ఇప్పుడు చిన్న‌జీవ‌య‌ర్ స్వామి మండిప‌డుతున్నార‌ట‌. సీఎం కేసీఆర్‌తో మాట్లాడిన జీయ‌ర్ స్వామి మూల‌విరాట్టును ముట్టుకోవ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించార‌ట‌. ఇందుకు పూర్తి స‌మాచారం తెలుసుకున్నాకే త‌మ‌తో మాట్లాడుతాన‌ని చెప్పార‌ట‌.

గతంలో స్వామి తలపై ఉండే ఏడు తలల ఆదిశేషుడికి బదులు ఇప్పుడు ఐదు తలల ఆదిశేషుడిని పునర్నిర్మించినట్టు సమాచారం. గతంలో మూలవిరాట్టు విగ్రహం శాంతమూర్తిగా దర్శనమివ్వగా.. ఇప్పుడది ఉగ్రరూపంలో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి ఆల‌య పున‌ర్నిర్మాణ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న స‌మాధానం ఏంటంటే…మూలవిరాట్టుపై మందంగా ఉండే సింధూరాన్ని తొలగించడంతో స్వామివారు ఉగ్ర‌రూపంలో క‌నిపిస్తున్నార‌ని, అందుకే పునర్నిర్మాణంలో భాగంగా కొత్త విగ్ర‌హం కూడా ఆవిధంగా రూపొందిస్తున్న‌ట్లు చెబుతున్నార‌ట‌.

రహస్యంగా జరిగిన ఈ వ్యవహారం చినజీయర్‌ స్వామికి తెలిసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కథనాలు వస్తున్నాయి. అయితే పునర్నిర్మాణంలో శాస్త్ర ప్రకారమే పనులు జరుగుతున్నాయని వైటీడీఏ మాజీ ప్రధాన స్థపతి సలహాదారు సౌందరరాజన్ తెలిపారు. గర్భాలయంలోని స్వయంభువులను ఉలితో చెక్కామన్న ప్రచారంలో నిజం లేదన్నారు. 60,70 ఏళ్లుగా స్వయంభువులకు సింధూరం మందంగా పట్టుకోవడం వల్ల స్వామివారి రూపం కనిపించకుండా ఉండిపోయిందన్నారు. ప్రధానార్చకుల సమక్షంలో ఇటీవల దాన్ని తొలగించడంతో స్వామి వారి రూపం బయటపడింద‌ని స్ప‌ష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news