సీబీఎస్ఈలో ఇక‌పై కొత్త రూల్‌.. అంద‌రూ పాస్ అవుతారు..!

-

సాధార‌ణంగా విద్యార్థుల్లో కొంద‌రు కొన్ని స‌బ్జెక్టుల్లో చాలా బ్రిలియంట్‌గా ఉంటారు. ఒక‌టి రెండు స‌బ్జెక్టులు మిన‌హా ఇత‌ర స‌బ్జెక్టుల్లో అద్భుత‌మైన ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రుస్తుంటారు. అయిన‌ప్ప‌టికీ ఆ రెండు స‌బ్జెక్టులలో ఫెయిల్ అవుతుంటారు. దీంతో కొన్ని సార్లు విద్యా సంవ‌త్స‌రాన్ని కూడా న‌ష్ట‌పోతుంటారు. అయితే ఇక‌పై సీబీఎస్ఈ విద్యార్థులు ఈ విష‌యంలో దిగులు చెందాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే కొత్త రూల్స్‌ను ప్ర‌వేశ‌పెట్టారు.

new rule in cbse passes every student

సీబీఎస్ఈ విద్య‌ను అభ్య‌సిస్తున్న విద్యార్థుల్లో స‌హ‌జంగానే చాలా మంది గ‌ణితం, సైన్సుల్లో ఫెయిల‌వుతున్నారు. కానీ వారు ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌, కంప్యూట‌ర్స్ వంటి ఇత‌ర స‌బ్జెక్టుల్లో స్కిల్స్‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అయితే ఆ రెండు స‌బ్జెక్టులలో ఫెయిల్ అవుతుండ‌డం వ‌ల్ల విద్యా సంవ‌త్స‌రాన్ని కోల్పోవాల్సి వ‌స్తుంది. కానీ ఇక‌పై విద్యా సంవ‌త్స‌రాన్ని కోల్పోవాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఆ రెండు స‌బ్జెక్టుల్లో ఫెయిల్ అయినా, ఇత‌ర ఏ స‌బ్జెక్టుల్లో అయినా ప్ర‌తిభ‌ను చాటితే వారిని ఫెయిల్ కాకుండా పాస్ అయిన వారిగా గుర్తిస్తారు.

సీబీఎస్ఈలో త్వ‌ర‌లో అమ‌లు చేయ‌నున్న ఈ విధానం వ‌ల్ల ఎంతో మంది విద్యార్థుల‌కు లాభం క‌లుగుతుంద‌ని ప‌లువురు ఉపాధ్యాయులు అంటున్నారు. కొంద‌రు విద్యార్థులు అనేక స‌బ్జెక్టుల్లో స‌త్తా చాటుతార‌ని, కానీ గ‌ణితం, సైన్సుల్లో ఫెయిల‌వుతార‌ని, అలాంటి వారికి ఈ కొత్త రూల్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, దీంతో విద్యా సంవ‌త్స‌రం న‌ష్ట‌పోకుండా ఉంటార‌ని ఉపాధ్యాయులు ఈ కొత్త రూల్‌కు కితాబిస్తున్నారు. అయితే ఆ రెండు స‌బ్జెక్టుల్లో ఫెయిలై ఇత‌ర స‌బ్జెక్టుల్లో ప్ర‌తిభ చాటితే ఓకే. కానీ అన్ని స‌బ్జెక్టుల్లోనూ ఫెయిల్ అయితే మాత్రం ఏమీ చేయలేరు. మ‌ళ్లీ అవి చ‌ద‌వాల్సిందే. క‌నుక ఆ విద్యార్థుల‌కు ఈ రూల్ మేలు చేయ‌ద‌ని అధ్యాపకులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news