ఆధార్ పాన్ లింక్ నుండి బంగారం వరకు… ఏప్రిల్ నుండి కొత్త రూల్స్..!

-

ప్రతీ నెలా కూడా కొన్ని అంశాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. వాటిని గమనించడం అవసరం. ఏయే ప్రభుత్వం నిబంధనలను మార్చారో చూసుకోండి. ఇప్పుడు మార్చి నెల సగం అయిపొయింది. మర్చి అయ్యేలోగా కొన్ని పనులని పూర్తి చేసుకోవాలి. అలానే ఏప్రిల్ 1, 2023 నుంచి కొన్ని మార్పులు రానున్నాయి. అవి కూడా చూసుకోవాలి. ఇక ఏప్రిల్ 1, 2023 నుంచి రాబోయే మార్పులు ఏమిటో చూసేద్దాం.

నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో మార్పులు:

నేషనల్ పెన్షన్ సిస్టమ్‌కి సంబంధించిన కొత్త రూల్ ఏప్రిల్ 1 నుండి అమలులోకి రాబోతోంది. డబ్బు విత్‌డ్రా చేసేటప్పుడు సభ్యులు కొన్ని డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చెయ్యాలి. అప్‌లోడ్ చేయకుండా NPS నుండి ఉపసంహరణ అవ్వదు.

ఆధార్ పాన్ లింక్:

ఆధార్ పాన్ ని లింక్ చేసుకోవాలని ఎప్పటి నుండో అంటున్నారు. అయినా కూడా ఆధార్ పాన్ ని లింక్ చేసుకోలేదు చాలా మంది. లింక్ చేసేందుకు గడువు మార్చి 2023 దాకా అవకాశం వుంది. కానీ ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ఇప్పుడు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

బంగారం కొనుగోలు పై కొత్త రూల్స్:

బంగారం కొనడానికి లేదా అమ్మడానికి వెళ్తున్నట్లయితే దీన్ని తప్పక తెలుసుకోండి. కొత్త హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ లేకుండా బంగారు ఆభరణాలు, ఇతర బంగారు వస్తువులను 31 మార్చి 2023 తర్వాత కొనలేరు. ఏప్రిల్ 1 నుంచి ఆరు అంకెల హాల్‌మార్క్‌లు మాత్రమే ఆమోదించబడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news