ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మొదలు ట్రాఫిక్ రూల్స్ దాకా.. ఫిబ్రవరి 1 నుంచి మారనున్న అంశాలు ఇవే..!

-

కొత్త సంవత్సరం లో మొదటి నెల పూర్తైపోతోంది. రెండో నెల వచ్చేస్తోంది. అయితే ప్రతీ నెలలో కూడా మార్పులు వస్తున్నట్టే ఈ నెల లో కూడా కొన్ని రూల్స్ లో మార్పులు రానున్నాయి. ఫిబ్రవరి 1 నుండి అనేక నియమాలు మారబోతున్నాయి. ఇవి సామాన్య ప్రజలపై కూడా ప్రభావం చూపిస్తాయి. మరి ఏయే రూల్స్ లో మార్పులు రానున్నాయి…? అనే ముఖ్య విషయాన్ని ఇప్పుడే చూసేద్దాం. జనవరి 31 నుండి ట్రాఫిక్, ప్యాకేజింగ్, గేమింగ్, ఆదాయపు పన్ను శాఖ ఇలా పలు రూల్స్ లో మార్పులు వస్తాయి. మరి వాటి వివరాలని చూసేద్దాం.

ట్రాఫిక్ రూల్స్:

ఫిబ్రవరి 1 నుంచి ట్రాఫిక్ రూల్స్ లో మార్పులు రాబోతున్నాయి. ఢిల్లీ-NCRలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానాలు డైరెక్ట్ గా అకౌంట్ నుండి కట్ చేస్తారట. రూ. 10,000 వరకు జరిమానా విధించవచ్చు. లేన్ వెలుపల డ్రైవింగ్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీ కోసం పలు రూల్స్ ని తెచ్చింది. అవి ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు రిజిస్ట్రేషన్ సైన్ పక్కా ఉండాలి. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో నమోదు చేయించుకోవాలి కూడా.

ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్:

జనవరి 31 తర్వాత ఆదాయపు పన్ను శాఖ లోని కొన్ని నిబంధనలు మారవచ్చు. వాటిని
2023-24 బడ్జెట్‌లో ప్రకటించవచ్చు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C లో కూడా మార్పులు రావచ్చట. మరి ఎలాంటి మార్పులు చేస్తారో చూద్దాం.

ప్యాకేజింగ్ నియమాలు:

ఫిబ్రవరి 1 నుంచి కొత్త ప్యాకేజింగ్ నిబంధనలను తీసుకు రాబోతున్నారు. ఈ రూల్స్ తో
ప్రజలకు ప్రయోజనం కలగనుంది. ఎడిబుల్ ఆయిల్, మైదా, బిస్కెట్లు, పాలు, నీళ్లు, బేబీ ఫుడ్, సిమెంట్ బ్యాగులు, డిటర్జెంట్లు, బ్రెడ్ ఇలా 19 రకాల వస్తువుల ప్యాకింగ్‌పై సమాచారం తప్పక అందించాలట.

ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు:

ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. రూ.18,000గా ఇప్పుడు కనీస వేతనం ఉండగా… దీన్ని రూ.26,000కు పెంచవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news