Breaking : బ్రేక్‌పడిన రాహుల్‌ పాదయాత్ర పునఃప్రారంభం

-

కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్మూ కాశ్మీర్‌లోని అవంతిపొరా నుండి తిరిగి ప్రారంభమయ్యింది. ఈ యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పాల్గొన్నారు. జమ్మూ కశ్మీర్ లో కొనసాగుతోన్న రాహుల్ పాదయాత్ర భద్రతా కారణాల దృష్ట్యా శుక్రవారం రద్దయింది. పాదయాత్రలో భాగంగా రాహుల్ బనిహాల్ టన్నెల్ క్రాస్ అవుతుండగా ఆయన్ని చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే జనాన్ని నియంత్రించాల్సిన స్థానిక పోలీసులు అకస్మాతుగా అదృశ్యమయ్యారు. దీంతో జనసముదాయాన్ని నియంత్రించడంలో లోపాలున్నట్లు గుర్తించిన రాహుల్ సెక్యూరిటీ పాదయాత్రను విరమించుకోవాలని సూచించారు. సెక్యూరిటీ సూచనతో రాహుల్ యాత్రను ఆపేసి నైట్ షెల్టర్కు వెళ్లిపోయారు.

దీంతో కశ్మీర్ లోయలో 11 కిలోమీటర్లు సాగాల్సిన రాహుల్ యాత్ర ఒక కిలోమిటర్కే పరిమితమైంది. కశ్మీర్ లోయలో మొత్తం 20 కిలోమీటర్లు రాహుల్ పాదయాత్ర జరగాల్సి ఉంది. బనిహాల్‌లో శుక్రవారం నడక మొదలుపెట్టి కిలోమీటర్ వరకూ యాత్ర సజావుగా జరిగింది. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కూడా ఆయనతో కలిసి అడుగులు వేశారు. కిలోమీటర్ తర్వాత ఒక్కసారిగా రాహుల్‌కు కల్పించిన సెక్యూరిటీ తగ్గిపోయింది. భద్రతా సిబ్బంది ఒక్కసారిగా పక్కకు వెళ్లడంతో.. రాహుల్‌పైకి జనం దూసుకువచ్చారు. దీంతో యాత్ర విరమించుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందంటోంది కాంగ్రెస్.

 

Read more RELATED
Recommended to you

Latest news