ప్రతీ నెలా కూడా కొన్ని అంశాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. ప్రతీ నెల లాగే వచ్చే నెల కూడా కొన్ని అంశాల్లో మార్పులు రానున్నాయి. వీటిని చూసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడచ్చు. ఇక మరి జనవరి లో మారనున్న అంశాల గురించి చూసేద్దాం.
బ్యాంక్ లాకర్ కొత్త రూల్స్:
బ్యాంక్ లాకర్ కి సంబంధించి కొత్త రూల్స్ వచ్చాయి. ఇక దీని గురించి పూర్తి వివరాలను చూస్తే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త లాకర్ నియమాలు జారీ చేసింది. ఇవి జనవరి 1, 2023 నుండి అమలులోకి రానున్నాయి. ఈ రూల్స్ ప్రకారం బ్యాంక్స్ ఖాతాదారులతో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం అవ్వదు. లాకర్ లో వుండే వాటికి నష్టం వస్తే బ్యాంకులే బాధ్యత వహించాలి. అలానే ఇప్పుడు వినియోగదారులు డిసెంబర్ 31 వరకు బ్యాంకుతో ఒప్పందంపై సంతకం చేయాలి.
జీఎస్టీ ఇ-ఇన్‌వాయిసింగ్ రూల్స్:
అలానే జీఎస్టీ ఇ-ఇన్‌వాయిసింగ్ రూల్స్ లో కూడా మార్పులు వచ్చాయి. 2023 సంవత్సరం నుండి జీఎస్టీ ఇ-ఇన్‌వాయిస్ కోసం 20 కోట్ల పరిమితిని 5 కోట్లకు ప్రభుత్వం తగ్గించింది. జనవరి 1, 2023 నుండి ఈ రూల్ రానుంది. 5 కోట్లకు పైగా వ్యాపారం చేసే వ్యాపారులు ఎలక్ట్రానిక్ బిల్లులను రూపొందించుకోవాల్సి వుంది.
క్రెడిట్ కార్డ్ రూల్స్:
క్రెడిట్ కార్డ్ నిబంధనలలో కూడా ఓ మార్పు రానుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపుల రివార్డ్ పాయింట్ల రూల్ ని మార్చనుంది. డిసెంబర్ 31, 2022లోపు అన్ని రివార్డ్ పాయింట్‌లను రీడిమ్ చేసుకోండి.