హైదరాబాద్ వాసులకు అలర్ట్‌..31వ తేదీ నుంచి నగరంలో కొత్త రూల్స్‌ !

-

 

హైదరాబాద్ వాసులకు అలర్ట్‌. ప్రసుతం హైదరాబాద్ వాసుల్లో న్యూ ఇయర్ జోష్, నెలకొంది. అయితే న్యూ ఇయర్ నేపథ్యంలోనే పోలీసులు కొన్ని కఠిన నియమ నిబంధనలను అమలు చేస్తున్నారు. 31 రాత్రి నుంచి జనవరి 1న తెల్లవారుజాము వరకు నెక్లెస్ రోడ్, పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే, ఔటర్ రింగ్ రోడ్డులతోపాటు ఫ్లై ఓవర్లు మూసివేసే అవకాశం ఉందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.

విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు విమాన టికెట్, సరైన ధ్రువీకరణ పత్రాలు చూపిస్తేనే ఆయా రోడ్లలో అనుమతి ఇస్తారని పేర్కొన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపిన, రాష్ డ్రైవింగ్, బైకులపై విన్యాసాలు చేసిన, మైనర్లు డ్రైవింగ్ చేసిన కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే రూ. 10,000 జరిమానా లేదా ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ లో మూడు నెలలు లేదా శాశ్వతంగా రద్దు చేస్తారని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news