ప్రముఖ హీరోయిన్ గా నటిగా గుర్తింపు తెచ్చుకున్న ధన్య బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. 7th సెన్స్, జయ జానకి నాయక, నేను శైలజ వంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించిన ధన్య బాలకృష్ణ.. రాజు గారి గది, సాఫ్ట్వేర్ సుధీర్, కార్బన్ వంటి సినిమాలలో కూడా హీరోయిన్గా నటించింది.ఈమధ్య వెబ్ సిరీస్ లతో కూడా బుల్లితెర ప్రేక్షకులను పలకరించింది. అల్లుడుగారు, లూజర్ , రెక్కీ వంటి వెబ్ సిరీస్ లో ఈమె హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా ఈమె ఆల్రెడీ పెళ్లి జరిగి, విడాకులు తీసుకున్న ఒక డైరెక్టర్ ను వివాహం చేసుకుంది అంటూ షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు రాగా.. ఇది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ విషయాన్ని మరొక నటి కల్పికా గణేష్ తన యూట్యూబ్ ఛానల్ లో ధన్యా గురించి ఈ విషయం చెబుతూ గతంలో ఒక వీడియో విడుదల చేసి సంచలనానికి దారితీసింది. తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు బాలాజీ మోహన్ దృవీకరించారు. ఇద్దరూ పెళ్ళి చేసుకున్నట్టు కూడా కోర్టుకి తెలిపారు. అయితే ప్రముఖ నటి కల్పిక గణేష్.. తనపై, తన భార్య ధన్య బాలకృష్ణ పై పరువు నష్టం కలిగించే యూట్యూబ్లో వీడియో విడుదల చేసిందని.. ఆయన కోర్టుకు సమర్పించారు. అంతేకాదు తమ వ్యక్తిగత పరువుకు భంగం కలిగించేలా కల్పిక గణేష్ వ్యాఖ్యలు చేశారు అని దర్శకుడు ఆరోపించారు.
ఇదిలా ఉండగా దర్శకుడు బాలాజీ మోహన్ నటి ధన్య బాలకృష్ణను జనవరి 2020లోనే వివాహం చేసుకున్నాడు. అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకు బయటకు పెట్టకపోవడం గమనార్హం. అయితే బాలాజీ మోహన్ కి ఇది రెండవ వివాహం. ఇదివరకే అరుణ అనే అమ్మాయిని వివాహం చేసుకుని.. విడాకులు కూడా ఇచ్చేశాడు.. మారి, మారి 2, వాయై మూడి పేసవుం వంటి చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించారు.