కందుకూరు కన్నీరు..తప్పు ఎవరిది?

-

ఊహించని ఘటన 15 కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకునేలా చేసింది. ఒక్కసారిగా కందుకూరు కన్నీరు పెట్టుకునే పరిస్తితి వచ్చింది. పార్టీ అభిమానం, అధినేతని చూడాలనే ఆశ..ప్రాణాలని తీసేలా చేసింది. అనుహ్మంగా కందుకూరులో జరిగిన ఘటనలో 8 మంది టీడీపీ కార్యకర్తలు ప్రాణాలు విడిచారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం కోసం చంద్రబాబు తాజాగా నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చారు. ఇదే క్రమంలో కందుకూరులో భారీ రోడ్ షో ప్లాన్ చేశారు.

ఇప్పటికే ఏలూరు, బాపట్ల, విజయనగరం జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమానికి బాబు రోడ్ షోకు భారీ స్థాయిలో జనం వచ్చారు. టీడీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇక ఇదే ఊపుతో కందుకూరులో కూడా బాబు రాక ముందే సెంటర్ లోకి జనం భారీగా వచ్చారు. ఇక సెంటర్‌కు బాబు రాగానే ఒక్కసారిగా పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు.

No photo description available.

అయితే అప్పటికే బాబు..కార్యకర్తలని బాబు జాగ్రత్తగా ఉండాలని వారిస్తూనే ఉన్నారు. దగ్గరలో వాహనాలు, కర్రలపైకి ఎక్కిన వారిని దిగాలని పలుమార్లు చెప్పారు. అటు కందుకూరు టీడీపీ ఇంచార్జ్ ఇంటూరు నాగేశ్వరావు సైతం మురుగు కాల్వ ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలా వారిస్తూనే బాబు స్పీచ్ మొదలుపెడుతుండగా..కొందరు కార్యకర్తలు తోపులాటలో మురుగు కాల్వలో పడిపోయారని తెలిసింది.

దీంతో బాబు స్పీచ్ ఆపేసి..వెంటనే వారిని హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని, నేతలు దగ్గరుండి అన్నీ చూసుకోవాలని కోరారు. అయితే పక్కన హాస్పిటల్ ఉంది..కానీ కార్యకర్తలు ప్రాణాలు మిగిలి లేవు. దీంతో బాబు కూడా వెంటనే హాస్పిటల్‌కు వెళ్లారు. అక్కడ 8 మంది కార్యకర్తలు చనిపోయారని తెలుసుకుని బాబు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక అలాగే రోడ్ షో వద్దకు వచ్చి..కార్యకర్తలు చనిపోయిన విషయాన్ని బాధతో చెప్పి..సంతాపం ప్రకటించి..చనిపోయిన వారికి ఒక్కొక్కరికి 10 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. ఇక 7 మంది వరకు గాయపడ్డారు. వారిని ఆదుకుంటామని చెప్పారు.

అయితే అభిమానంతో వచ్చిన వారు ప్రాణాలు విడవడంతో ఇటు టీడీపీలో, అటు చనిపోయిన వారి ఇళ్ళలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇలా అనూహ్యంగా జరిగిన ఘటనలో తప్పు ఎవరిది అనే ప్రశ్నలు వస్తున్నాయి. మొదట జనం భారీగా వస్తున్నారనుకుంటే…ఏదైనా ఖాళీ ప్లేస్ లో సభ పెట్టుకుంటే బాగుండేది. అదే సమయంలో పోలీసుల సెక్యూరిటీ కూడా తక్కువగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఏది ఎలా జరిగినా 8 మంది నిండుప్రాణాలు పోయాయి. మళ్ళీ ఇలాంటివి జరగకుండా రాజకీయ పార్టీలు, పోలీసులు చర్యలు తీసుకుంటే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news