కడప రోడ్డు ప్రమాదంలో కొత్త ట్విస్ట్ …!

కడప రోడ్డు ప్రమాదంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. టిప్పర్‌ను ఢీ కొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది. తమిళ స్మగ్లర్లకు, లోకల్ గ్యాంగ్‌ల మధ్య చేజింగ్ వల్లే ప్రమాదం జరిగినట్టు గుర్తించారు పోలీసులు. లోకల్ గ్యాంగ్ నుంచి తప్పించుకునే క్రమంలో అతివేగంగా వెళ్లిన తమిళ స్మగ్లర్లు.. రోడ్డు పక్క నుంచి వస్తున్న టిప్పర్ ను గమనించకపోవడంతోనే ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో సజీవ దహనమైన వారితో పాటు గాయపడ్డ వారంతా ఓకటే బ్యాచ్ కాగా.. వెంబడిస్తున్న కారు లోకల్ హైజాక్ గ్యాంగ్‌దిగా గుర్తించారు. లోకల్ హైజాక్ గ్యాంగ్‌ కోసం గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు.

లారీ, రెండు కార్లు ఢీకొని నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు సజీవదహనమయ్యారు. కడప శివారులోని గోటూరు వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. ఎర్రచందనం తరలిస్తున్న సుమో… టిప్పర్‌ను ఢీ కొట్టగా.. ఆ వెంటనే మరోకారు కూడా వాటిని ఢీ కొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయ్‌. గోటూరు, తోళ్లగంగన్నపల్లె మధ్యలో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.