మందే కాదు.. ఫుడ్డు లాగించారు. న్యూ ఇయర్ రోజు రికార్డ్ స్థాయిలో ఆన్ లైన్ ఫుడ్ డెలవరీలు

-

న్యూ ఇయర్ రాగానే మందుబాబులు రికార్డ్ స్థాయిలో మందును తాగేస్తుంటారు. ఒక్క కొత్త సంవత్సరం రోజునే కోట్లలో ఎక్సైజ్ శాఖకు ఆదాయం వస్తుంటుంది. ఇంకొంత మంది న్యూ ఇయర్ రోజులన కొత్తకొత్త డిష్ లను టేస్ట్ చేయాలని అనుకుంటారు. అయితే ఈసారి ఇలా ఫుడ్ డెలవరీ ఆర్డర్లు కూడా రికార్డ్ స్థాయిలో పెరిగాయి. స్విగ్గీ, జొమాటోలకు రికార్డ్ స్థాయి ఆర్డర్లు వచ్చాయి.

డిసెంబర్ 31రోజున ఆన్ లైన్ ఫుడ్ డెలవరీ యాప్స్ కు ఇబ్బడిముబ్బడిగా ఫుడ్ ఆర్డర్లు వచ్చిపడ్డాయి. ఆన్ లైన్ డెలవరీ యాప్ స్విగ్గీకీ ఏకంగా నిమిషానికి 9500 ఆర్డర్లు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న రికార్డులను కూడా తుడిచిపెట్టే విధంగా ఆర్డర్లు వచ్చాయి. మరో ప్రముఖ ఫుడ్ డెలవరీ యాప్ జోమాటో రెండో స్థానంలో 7100 ఆర్డర్లతో నిలిచింది. ఫుడ్ డెలవరీల్లో బెంగళూర్ మొదటిస్థానంలో నిలవగా… రెండో స్థానంలో హైదరాబాద్ నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news