ఈ మధ్యకాలంలో నకిలీ వార్తలకి అదుపు లేకుండా పోతోంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక నకిలీ వార్త మనం వింటూనే ఉన్నాం. స్కామ్స్ మొదలు ఎన్నో ఫేక్ వార్తల్ని మనం రోజు చూస్తున్నాం. అలానే పండగలు, ప్రత్యేక దినాలు వస్తే మోసాలు కి అసలు లిమిట్ ఏ ఉండడం లేదు. గిఫ్ట్స్ అంటూ ఏవో లింకులు పెట్టి మోసం చేస్తున్నారు. అయితే కొత్త సంవత్సరం సందర్భంగా గిఫ్ట్స్ పేరిట వాట్సాప్ లో ఒక స్కామ్ నడుస్తోంది.
ఒక లింకు పంపిస్తూ దీని ద్వారా ఖరీదైన గిఫ్ట్ గెలుచుకోవచ్చు అని Rediroff.ru. లింక్ ని పంపుతున్నారు. అయితే అలా ఫార్వర్డ్ చేసిన లింక్ ఓపెన్ చేస్తే సర్వే నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత గిఫ్ట్ లు వస్తాయి అంటూ మరో వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇంకేముంది పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. తర్వాత బ్యాంక్ ఖాతాని ఆక్సిస్ చేసి డబ్బులు దోచుకుంటున్నారు. అలానే ‘Excuse me’, Who are you’, I found you on my contact list’ అని మెసేజ్ చేస్తున్నారు.
అందరూ ఇలాంటి లింకులు నమ్మి మోసపోతున్నారు. అందుకని ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఇలాంటి మెసేజ్లని చూసి మోసపోకండి. ఏది ఏమైనా ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి లేదు అంటే బ్యాంక్ ఖాతా మొత్తం ఖాళీ అయిపోతుంది.
ఎప్పుడూ కూడా అనుమానంగా ఉన్న లింక్స్ ని క్లిక్ చేయండి. అలానే తెలియని వ్యక్తి నుంచి మెసేజ్ వస్తే బ్లాక్ చేసేయండి. అంతే కానీ అనవసరంగా మోసగాళ్ల చేతిలో మోసపోయి డబ్బుల్ని పోగొట్టకండి. అలానే మీరు క్లిక్ చేయడమే కాకుండా ఇతరులకు కూడా ఈ లింక్స్ ని ఫార్వర్డ్ చేసి వాళ్ళు కూడా మోసపోయేలా చెయ్యద్దు.