Ram Charan: RC 15 అప్‌డేట్ లోడింగ్..హింట్ ఇచ్చేసిన థమన్

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం RC 15 అప్ డేట్ కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. RRR తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న ఈ పిక్చర్ పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుండగా, శ్రీకాంత్, అంజలి, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కార్తీక్ సుబ్బరాజు ఈ ఫిల్మ్ కు స్టోరి అందించగా, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉండబోతున్నది. ఇప్పటికే ఈ సినిమా నుంచి లీక్ అయిన ఫొటోలు నెట్టింట హల్ చల్ అయ్యాయి. రామ్ చరణ్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం.

ఇటీవల చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ అప్ డేట్ ఒకటి ఇచ్చేసిన థమన్..తాజాగా రామ్ చరణ్ ‘RC 15’ అప్ డేట్ రాబోతున్నదనే హింట్ ఇచ్చేశాడు. ట్విట్టర్ వేదికగా డైరెక్టర్ శంకర్ తో మ్యూజికల్ సిట్టింగ్ సందర్భంగా దిగిన ఫొటో షేర్ చేశాడు. త్వరలో ఈ సినిమా నుంచి అప్ డేట్ రాబోతున్నదని చెప్పకనే చెప్పేశాడు. ఈ మూవీ అప్ డేట్ కోసం మెగా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news