ప్రైవేటు కండక్టర్లు, డ్రైవర్ల దోపిడీ మామూలుగా లేదుగా..

-

ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మె కొన‌సాగుతూనే ఉంది. దీంతో బస్సులను ప్రైవేటు వ్యక్తులతో నడిపిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఒకవైపు ఇప్పటికే ప్రైవేట్‌ ట్రావెల్స్‌, ప్రైవేటు వాహనాల యజమానులు డబుల్‌, ట్రిబుల్‌ రేట్లను వసూలు చేస్తుండగా… మరోవైపు ఆర్టీసీ బస్సులను నిర్వహించేందుకుగాను ప్రభుత్వం నియమించిన తాత్కాలిక కండక్టర్లలో కొందరు ప్ర‌యాణికుల ద‌గ్గ‌ర అందినకాడికి గుంజుతున్నారు.

తాత్కాలిక కండక్టర్లు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని, టికెట్లు కూడా ఇవ్వడం లేదని, ప్రశ్నిస్తే దిగిపొమ్మంటున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నా అవి సరిపోవడం లేదని, దసరాకు సొంతూళ్లకు వెళ్ళే క్రమంలో చాలా కష్టమవుతోందని పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news