ముగ్గురు టాప్ హీరోల లుక్‌లు… ఎవ‌రిది టాప్ అంటే..

ముగ్గురు స్టార్ హీరోలు.. మూడు బడా సినిమాలు.. అన్నీ కూడా సంక్రాంతి రిలీజ్‌లు.. బాల‌య్య సినిమా మాత్రం క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 20న వ‌స్తోంది. ఈ మూడు సినిమాల‌తో ముగ్గురు స్టార్లు త‌మ ఫ్యాన్స్‌కు ద‌స‌రా కానుక‌గా పెద్ద ట్రీట్ ఇచ్చారు. స‌రికొత్త లుక్స్‌తో పోస్ట‌ర్లు రిలీజ్ చేసి ద‌స‌రా శుభాకాంక్ష‌లు చెప్పారు.
‘అల వైకుంఠపురంలో’, ‘సరిలేరు నీకెవ్వరూ’, ‘ఎన్‌బీకె 105’ చిత్రాలు పోస్ట‌ర్ల టాక్ ఎలా ?  ఉందో చూద్దాం.

అల వైకుంఠపురంలో…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురంలో సంక్రాంతికి వ‌స్తోంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన సామజవరగమన లిరికల్ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక తాజా పోస్ట‌ర్ నార్మల్‌గా ఉంది. బ‌న్నీ యాక్ష‌న్ మోడ్లో ఉన్నాడు. మాస్ + క్లాస్ క‌లిపిని సినిమాగా క‌నిపిస్తోంది. జులాయి- సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్‌కు రంగం సిద్ధం అవుతున్నట్లే.

సరిలేరు నీకెవ్వరూ…
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరూ సంక్రాంతికే వ‌స్తోంది. ఆర్మీ మేజర్ లుక్‌లో మహేష్‌ను చూసి ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ ఖాయమంటున్నారు. కర్నూలు కొండారెడ్డి బురుజు ముందు గొడ్డలి పట్టిన మహేష్ బాబు మరోసారి ‘ఒక్కడు’ మ్యాజిక్‌ను రిపీట్ చేశాడని చెప్పాలి. ఈ పోస్ట‌ర్ బాగా వైర‌ల్ అవుతోంది. మూడు స్టిల్స్‌లో దీనికే ఎక్కువ మార్కులు ప‌డుతున్నాయి.

ఎన్‌బీకె 105…
జై సింహ మూవీ తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీనికి ‘ఎన్‌బీకె 105’ అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో బాలకృష్ణ రక్తమోడుతున్న కత్తి చేతపట్టి కనిపించారు. బాల‌య్య ఊచ‌కోత‌కు రెడీ అయిన‌ట్టే ఉంది. ఏదేమైనా మూడు పోస్ట‌ర్ల‌లో మ‌హేష్ పోస్ట‌ర్‌కే ఎక్కువ మార్కులు ప‌డ్డాయి.