ఏపీలో టీడీపీకి బిగ్ షాక్‌… వైసీపీలోకి మాజీ ఎమ్మెల్సీ

-

ఏపీలో ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి వరుస షాకుల‌ పరంపరలో మరో అదిరిపోయే షాక్ తగలనుంది. మాజీ వైసీపీ నేత ప్రస్తుత… టిడిపి నేత మాజీ ఎమ్మెల్సి ఒకరు తిరిగి వైసిపిలోకి చేయనున్నారు. ఇంత‌కు అన్ని జంపింగ్‌లు చేసిన  ఆ నేత ఎవరో కాదు మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు. మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు నేడు వైసీపీలో చేరనున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. జూపూడి ప్రభాకర్ రావు 2014 ఎన్నికల సమయంలో వైసీపీలోనే ఉన్నారు.

ఆ ఎన్నిక‌ల‌కు ముందు జూపూడి జ‌గ‌న్ వాయిస్ మీడియాలో బ‌లంగా వినిపిస్తూ చంద్ర‌బాబు, కాంగ్రెస్‌ను ఓ రేంజులో టార్గెట్ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ జూపూడికి ప్ర‌కాశం జిల్లా కొండ‌పి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ సీటు ఇచ్చారు. ఆ ఎన్నిక‌ల్లో జూపూడిపై టీడీపీ అభ్య‌ర్థి డోలా బాలా శ్రీ వీరాంజ‌నేయ‌స్వామి చేతిలో ఓడిపోయారు. ఆ వెంట‌నే వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరిపోయారు. ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కూడా చంద్రబాబు ఇచ్చారు.

అప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌పై ఈగ వాల‌నీయ‌ని జూపూడి టీడీపీలోకి వ‌చ్చి ప‌ద‌వులు చేప‌ట్టిన వెంట‌నే జ‌గ‌న్‌పై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌కాశం జిల్లాలో త‌న‌ను ఓడించేందుకు వైవి.సుబ్బారెడ్డి, ప్ర‌స్తుత మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ప్ర‌య‌త్నాలు చేశార‌ని తీవ్రంగా విమ‌ర్శించారు. టీడీపీ అధికారంలో ఉన్న రోజులు ఆ పార్టీతో అంట‌కాగిన జూపూడి ఈ ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోవ‌డంతో బాబుకు అదిరిపోయే ఝుల‌క్ ఇచ్చారు.

ఎన్నికల్లో టీడీపీ ఓటమిపై మేథోమథనం సందర్భంగా జూపూడి లేవనెత్తిన అంశాలను చంద్రబాబు తోసి పుచ్చారు. ప్రసంగాన్ని మధ్యలోనే ఆపించారు. దాంతో అప్పటి నుంచి జూపూడి టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు తిరిగి వైసీపీ అధికారంలోకి రావడంతో జూపూడి ప్రభాకర్ రావు తిరిగి వైసీపీలో చేరుతున్నారు. ఈరోజు జూపూడి ప్రభాకర్ రావు జగన్ ను కలవనున్నారు. జ‌గ‌న్ స‌మక్షంలోనే పార్డీ కండువా క‌ప్పుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news