పీఎఫ్ఐ కేసులో 8 రాష్ట్రాల్లో మరోసారి ఎన్ఐఏ, ఈడీ సోదాలు

-

భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సమీకరణే కాకుండా మతకల్లోలాలు సృష్టించడానికి కుట్ర పన్నుతున్న పీఎఫ్ఐపై కేంద్ర సంస్థలో మరోమారు నిఘా పెట్టాయి. ఎన్ఐఏ, ఈడీ సంయుక్తంగా మరోసారి దాడులకు దిగాయి. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో ఇవాళ ఉదయం సోదాలు షురూ చేశాయి. పీఎఫ్ఐతో సంబంధం ఉన్న అనేక మంది సభ్యులు, సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, దిల్లీ, కేరళ, గుజరాత్, కర్ణాటక, అసోంలో ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్​లో కేంద్ర నిఘా సంస్థ-ఐబీ, ఆయా రాష్ట్రాల పోలీసులు కూడా భాగమైనట్లు ఎన్​ఐఏ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. పీఎఫ్​ఐ లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేయడం.. గత రెండు వారాల్లో ఇది మూడోసారి.

సెప్టెంబర్ 22న దేశవ్యాప్తంగా ఎన్​ఐఏ విస్తృత సోదాలు నిర్వహించింది. దేశంలో తీవ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలపై 11 రాష్ట్రాల్లోని 106 మంది పీఎఫ్​ఐ కార్యకర్తలను అరెస్టు చేసింది. కేరళలో అత్యధిక అరెస్టులు జరిగాయి. దాదాపు 22 మందిని అరెస్టు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక (20), తమిళనాడు (10), అసోం (9), ఉత్తరప్రదేశ్ (8), ఆంధ్రప్రదేశ్ (5), మధ్యప్రదేశ్ (4) , పుదుచ్చేరి, దిల్లీ (3) రాజస్థాన్ (2)లోనూ పలువురిని అరెస్టు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news