Nidhhi Agerwal: అందాల ‘నిధి’ అగర్వాల్ సినిమాల ఆలస్యానికి కారణాలివే..

-

బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్.. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చి సక్సెస్ అయ్యారు. అందం అమ్మాయి అయితే కచ్చితం అది నిధి అగర్వాలేనని సినీ అభిమానులు అంటుంటారు. ‘సవ్యసాచి’ పిక్చర్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి.. పూరీ జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో సక్సెస్ అందుకుంది. ఈ భామ తెలుగులో చేసింది తక్కువ చిత్రాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజ్ ను సొంతం చేసుకుంది.

అక్కినేని అన్నదమ్ములు నాగచైతన్య, అఖిల్ తో కలిసి నటించిన నిధి అగర్వాల్.. సినిమాలు స్లోగానే చేస్తోంది. ఇందుకు గల కారణాలను కూడా వెల్లడించింది ఈ సుందరి. నిదానంగానే ఫిల్మ్స్ చేస్తూ ముందకు సాగుతానని, అలా అయితేనే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం మనగలుగుతామని అంది. సక్సెస్ కావాలంటే సరైన పాత్రలను చిత్రాలలో పోషించాలని అభిప్రాయపడింది.

అశోక్ గల్లా హీరోగా వచ్చిన ‘హీరో’ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అశోక్ గల్లా తొలి చిత్రంలో కథానాయికగా నటించిన నిధి అగర్వాల్.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పీరియాడిక్ అండ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మెఘలుల కాలం నేపథ్యం నాటిది. ఈ మూవీపైన పవన్ కల్యాణ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ పిక్చర్ ఈ ఏడాది దసరా కానుకగా విడుదలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news