మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా మెగా డాటర్ అంటూనే తనకు స్పెషల్ ఇమేజ్ ను కూడా సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావాలని ఎంతో ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే మొదటగా యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి .. ఆ తర్వాత అవకాశాలు హీరోయిన్గా అందుకుంది.. కానీ ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు.. కనీసం పాజిటివ్ టాక్ కూడా తెచ్చుకోలేదు.. అంతలా డిజాస్టర్ టాకులు సంపాదించుకున్నాయి.
ఇకపోతే ఈ హీరోయిన్లు పనులు మనకు వర్కౌట్ అవ్వవు అంటూ ఆ తర్వాత ఇంట్లో పెద్దలు చెప్పిన పెళ్లిని చేసుకొని సక్సెస్ఫుల్గా లైఫ్ను ముందుకు తీసుకెళ్తుంది. అయితే.. తాజాగా నిహారిక, ఆమె భర్త వెంకట చైతన్య ఇద్దరూ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ ఒకరికి ఒకరు ఇన్ స్టాలో అన్ ఫాలో అయ్యారట. అంతేకాదు.. తమ పెళ్లి ఫోటోలను ఇన్ స్టా నుంచి చైతన్య డిలీట్ చేశాడని సమాచారం అందుతోంది. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటారని టాక్ వినిపిస్తోంది.