పెద్దపల్లి కారులో పోరు..సిట్టింగులకు సెగలు!

-

అధికార బీఆర్ఎస్ పార్టీలో సీట్ల కోసం పోటీ పెరుగుతుంది..నేతల మధ్య ఆధిపత్య పోరు మరింత ఎక్కువ అవుతుంది. ఇప్పటికే చాలా స్థానాల్లో సీట్ల కోసం నేతలు కుమ్ములాటలకు దిగుతున్నారు. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సెగలు వచ్చేలా బి‌ఆర్‌ఎస్ నేతలు సీటు కోసం పోటీ పడుతున్నారు. ఇదే క్రమంలో పెద్దపల్లి పరిధిలో మూడు స్థానాల్లో సీట్ల కోసం రచ్చ నడుస్తోంది.

ముఖ్యంగా పెద్దపల్లి అసెంబ్లీ సీటులో రచ్చ ఎక్కువ ఉంది. గత ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ నుంచి దాసరి మనోహర్ రెడ్డి గెలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈయనపై కాస్త వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి సీటు కోసం దాసరితో పాటు జూలపల్లి జెడ్‌పి‌టి‌సి బొద్దుల లక్ష్మణ్ పోటీ పడుతున్నారు. అటు బి‌ఆర్‌ఎస్ కీలక నేతలు ఈద శంకర్ రెడ్డి, నల్లా మనోహర్ రెడ్డి, చిరుమల్ల రాకేశ్ సైతం పెద్దపల్లి రేసులో ఉన్నారు. ఇక గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రఘువీర్ సింగ్ సైతం పెద్దపల్లి సీటు ఆశితున్నారు.

ఇక రామగుండం విషయంకు వస్తే..గత ఎన్నికల్లో ఏ‌ఐ‌ఎఫ్‌బి పార్టీ నుంచి కోరుకంటి చందర్ గెలిచారు. ఆ తర్వాత ఈయన బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. అప్పటినుంచి బి‌ఆర్‌ఎస్ లో ఆధిపత్య పోరు నడుస్తోంది..ఈ సీటు కోసం జెడ్‌పి‌టి‌సి సంధ్యారాణి, కోలేటి దామోదర్, మిర్యాల రాజి రెడ్డి, కొంకటి లక్ష్మీనారాయణ సైతం రామగుండం సీటు ఆశిస్తున్నారు.

అటు మంథని సీటులో గత ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ నుంచి పుట్టా మధు పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఆయన మళ్ళీ బరిలో నిలబడాలని చూస్తున్నారు. ఈయనకు పోటీగా చల్ల నారాయణరెడ్డి, కౠ నాగయ్య మంథని సీటు ఆశిస్తున్నారు. అలాగే నీటి పారుదల శాఖలో పనిచేస్తున్న ఓ అధికారి సైతం మంథని బి‌ఆర్‌ఎస్ సీటు ఆశిస్తున్నారట . ఇలా సీట్ల విషయంలో పోటీ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news