ఇన్ స్టా ఫీల్ : అన్ స్టాప‌బుల్ నిహారిక ! రియ‌లైజ్ అయిందా ?

-

మెగా డాట‌ర్ రీఛార్జ్ అయ్యారా లేదా రియ‌లైజ్ అయ్యారా.. ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో.. కొన్ని వివాదాల త‌రువాత మ‌నుషులు బాగుంటారు. త‌ప్పులు దిద్దుకుంటే లోకానికి న‌చ్చుతారు. మెగా డాట‌ర్ ఇప్పుడు మ‌ళ్లీ హ‌ల్చ‌ల్ చేస్తోంది. ఇన్ స్టా వాకిట రీ ఎంట్రీ ఇచ్చింది.

సినీ కుటుంబాల నుంచి వచ్చిన కొత్త జెనరేషన్ పిల్లలు ఎప్పుడూ పది రేట్లు స్పీడ్ గా ఉంటారు. కొన్ని రకాల వాటిని నెత్తిన వేసుకొని ఎప్పుడూ ఏదొక వార్త‌ల్లో చిక్కుకొని హైలెట్ అవుతున్న ముద్దుగుమ్మల్లో ఒకరు మెగా డాటర్ నిహారిక. వెబ్‌ సిరీస్‌లు, సినిమాలతో సందడి చేసే నిహారిక సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఒక‌ట్రెండు సినిమాలు కూడా చేసింది. అవి అమ్మడుకు పెద్దగా కలిసి రాలేదు. అనుకున్న స్థాయిలో హిట్ ఇవ్వలేక పోయాయి. ఏవో కొన్ని షో లలో మెరిసింది. అవి కూడా ఆమెకు క్రేజ్ ను ఇవ్వలేక పోయాయి. దాంతో అభిమానులకు ఎలాగైనా దగ్గర అవ్వాలని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో వుండేది.. పర్సనల్ లైఫ్ గురించి చెప్పేది..తాజా ఫోటోలను షేర్ చేస్తూ బిజిగా వుండేది. అలా మెగా ఫ్యాన్స్ లో ఫాలోయింగ్ ను పెంచుకుంది. ఇన్ స్టాలో ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్స్ ను తెచ్చుకుంది. అటుపై ఫెమిలియ‌ర్ నౌన్ గా స్థిర‌ప‌డే ప్ర‌య‌త్నం చేసింది.

ఎప్పుడూ ఆన్ లైన్ మీడియాలో సంద‌డి చేసే ఈ మెగా బేబీ ఈ మధ్య కాలంలో మాత్రం పెద్దగా కనిపించడం లేదు. దాదాపు 8 వారాలుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్ చేయలేదు. మొన్నీమధ్య హైదరాబాద్‌లోని పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో పోలీసులు దర్యాప్తు చేసిన సమయంలో నిహారిక ఉండడం.. ఆ విష‌యం రచ్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఇంత వరకు నిహారిక ఇటు సోషల్‌ మీడియాలో కానీ, అటు బయట కానీ ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. ఇంటికే ప‌రిమితం అయింది కూడా ! తాజాగా నిహారిక ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా రీ ఎంట్రీ కొట్టి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. 8 వారాల తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన విషయాన్ని తెలుపుతూ ఓ ఫొటోను పోస్ట్‌ చేసింది.

ఈ ఎనిమిది వారాలలో అమ్మాయి ఏం నేర్చుకుంది అనే విషయాలను కూడా పోస్ట్ చేయడం విశేషం. బ్రేక్‌ నుంచి తాను నేర్చుకున్న పాఠాలు ఇవేనంటూ.. ‘ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదు’, ‘ఇతరులు ఏం చేస్తున్నారన్నది నేను పట్టించుకోను’ ‘ఇప్పుడు నేను నిజంగా రిఫ్రెష్‌ అయ్యాను. మళ్ళీ ముందులాగే సోషల్ మీడియాలో చురుగ్గా వుంటాను’ అని రాసుకొచ్చింది. రెండు నెలల తర్వాత ఇలా పోస్ట్ చేయడం ఆసక్తిగా మారింది. దీంతో పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది..ఇప్పుడు బ్యాక్ టు మై వరల్డ్ అని నిహారిక అందరికి చెబుతుంది. అంతేకాదు..’హలో వరల్డ్‌’ పేరుతో ఓ వెబ్‌ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఇందుకు సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమాలు నిర్వహించి, షూటింగ్‌ని ప్రారంభించారు. ఈ సిరీస్‌లో సదా, ఆర్యన్‌ రాజేశ్‌ మెయిన్ రోల్ ప్లే చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news