భారతదేశ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చైనా దేశానికి చెందిన షావోమీ మొబైల్ కంపెనీకి గట్టి షాక్ ఇచ్చారు. విదేశీ మారకద్రవ్య చట్టాల ఉల్లంఘన ఆరోపణలపై రూ.5,551.27 కోట్ల విలువైన కంపెనీ నిధులను శనివారం జప్తు చేసింది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది.
”ఈ కంపెనీ గత కొన్నేళ్లుగా రూ.5551,27 కోట్ల విదేశి నిధులను మూడు సంస్థలకు అక్రమంగా పంపించింది. షావోమి గ్రూప్‌తో పాటు అమెరికాలో ఉన్న మరో రెండు సంస్థలకు ఈ నిధులు చేరినట్లు ఆధారాలు ఉన్నాయి. రాయల్టీల రూపంలోనే ఈ భారీ మొత్తాన్ని బదిలీ చేసింది. ఇలా పంపించటం ఫెమా చట్ట నిబంధనలకు విరుద్ధం. అని ఈడీ వెల్లడించింది. మరోపక్క షావోమీ కంపెనీ 2014 నుంచి భారతదేశంలో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 2015 నుంచి చెల్లింపులు చేస్తోంది. ఎంఐ బ్రాండ్ ఉత్పత్తులకు షావోమీ భారత్‌లో ట్రేడర్, డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తోంది. ఈ సంస్థ తయారు చేసిన వివిధ మొబైల్స్‌ను ఎంఐ బ్రాండ్ కింద విక్రయిస్తుంది.