యువకథానాయకుడు నిఖిల్ సిద్దార్ధ్ తన గత సినిమా కార్తికేయ 2 తో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుని వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. తాజాగా స్పై అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రేపు అనగా జూన్ 29వ తేదీన థియేటర్ లలోకి రానున్నాడు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1605 కు పైగా థియేటర్ లలో విడుదల అవుతోంది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలలో 635 కు పైగా థియేటర్ లలో విడుదల చేస్తుండగా, ఇండియాలోని మిగిలిన రాష్ట్రాలలో 550 థియేటర్ లలో రన్ చేయనున్నారు. ఇక ఓవర్సీస్ లో కి 420 పైగా థియేటర్ లను స్పై సినిమా కోసం కేటాయించడం జరిగిందని మేకర్స్ ప్రకటించారు.
ఇందులో నిఖిల్ కు జంటగా ఐశ్వర్య మీనన్ నటిస్తుండగా… గ్యారీ దర్శకత్వంలో సినిమా అద్భుతంగా తెరకెక్కిందని సినిమా బృందం అంతా కూడా విజయంపై ధీమాతో ఉంది. మరి చిత్ర బృందం పెట్టుకున్న అంచనాలు నిజామా అవుతాయా లేదా అన్నది తెలియాలంటే రేపు ఫస్ట్ షో పూర్తయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.