హరీశ్ రావు వ్యాఖ్యలు హాస్యాస్పదం : నిర్మలా సీతారామన్

-

ఇష్టమున్న రాష్ట్రాలకు నిధులు ఎక్కువగా ఇస్తున్నారని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తెలంగాణకు కేంద్రం ఏం సాయం చేయలేదని తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారమే రాష్ట్రాలకు నిధులుంటాయని తెలిపారు.

The Union Minister for Finance and Corporate Affairs, Smt. Nirmala Sitharaman addressing a Press Conference, in New Delhi on June 28, 2021.

ఇతర దేశాలతో పోలిస్తే భారత జీడీపీ ఆశావహంగా ఉందని నిర్మలా సీతారామన్‌ అన్నారు. చాలా దేశాల్లో ప్రస్తుతం ఆర్థికమాంద్యం పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతోందన్నారు.

కేంద్రం వసూలు చేసే సెస్సులు కూడా రాష్ట్రాలకే వెళ్తాయి. కేంద్రం వసూలు చేసిన సెస్సుల కంటే రాష్ట్రాలకే ఎక్కువ ఇచ్చాం. బడ్జెటేతర అప్పులు ఎక్కువ చేస్తే ఏ రాష్ట్రానికైనా నష్టమే. తెలంగాణలో పుట్టబోయే బిడ్డపై కూడా రూ. 1.25 లక్షల అప్పు పడుతోంది. విపత్తుల నిధి నుంచి తెలంగాణకు 188 కోట్లు ఇచ్చాం. ఇచ్చిన ప్రతి పైసాను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేస్తాం. పార్టీల ఉచితాలపై సమగ్ర చర్చలు జరగాలి. రాష్ట్ర రెవెన్యూ ఆధారంగానే పథకాలు ఉండాలి. అప్పులు తీర్చే రాబడిని చూపించి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news