`నిశ్శబ్దం’ నిర్మాతలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న అనుష్క‌..!!

-

అనుష్క‌.. సౌత్ ఇండియ‌న్ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా చ‌క్కం తిప్పిన ఈ బ్యూటికి ఫ్యాన్ ఫాలోంగ్ ఏ రేంజ్‌లో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎలాంటి పాత్రలైన తాను చేయ‌గ‌ల‌ను అని నిరూపించుకున్న అనుష్క‌.. జ‌క్క‌న్న తెర‌కెక్కించిన బాహుబ‌లి సినిమాతో మ‌రింత క్రేజ్ సంపాధించుకుంది. అయితే భాగమతి తర్వాత ఈమె సినిమా కోసం ఫ్యాన్స్‌ ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. కానీ, వీళ్ల‌రు నిరాశే ఎదురైంది. ప్ర‌స్తుతం అనుష్క న‌టించిన చిత్రం ‘నిశ్శబ్దం’.

హేమంత్ మధుకర్ దర్శకత్వం వ‌హించిన ఈ సినిమాకు కోన వెంకట్, విశ్వప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరించారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఇందులో అనుష్క ఓ ముగ అమ్మాయి పాత్రలో నటిస్తుంది. మ‌రియు ఇందులో మాధవన్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఏప్రిల్ 2న విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, లాక్‌డౌన్ కార‌ణంగా సినిమా థియేట‌ర్‌లోకి రాలేక‌పోయింది. ఒక‌వేళ లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత థియేటర్స్ కి జనాలు ఎంతవరకూ వస్తారనేది ప్రశ్నార్థకరంగా మారింది.

ఇదే స‌మ‌యంలో నిశ్శబ్దం సినిమాకి అమెజాన్ నుంచి భారీ ఆఫర్ వచ్చిందట. సినిమా పూర్తయిపోయి నెలకి 50 లక్షలు వడ్డీలు కట్టుకుంటున్న నిర్మాతలు, అమెజాన్ కి ఇవ్వడానికి సిద్ధమయ్యార‌ని టాక్ వినిపిస్తుంది. కానీ, ఇలా చేయాలంటే అనుష్క ప‌ర్మీష‌న్ ఖ‌చ్చితంగా ఉండాలి. అయితే, ఆమె మాత్రం అంగీకరించడం లేదట. దాంతో వడ్డీలు కట్టుకోలేక నిర్మాత‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ట‌. దీంతో అనుష్కపై నిర్మాత‌లు చాలా గుర్రుగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది కాల‌మే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news