టాలీవుడ్ హీరో నితిన్, షాలినీల వివాహం ఈ నెల 26న జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అదిరిపోయేలా నిర్వహిస్తున్నారు. తాజాగా మెహందీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ ఫొటోలను ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఇందులో నితిన్ – షాలిని చేతులకు మెహందీ పెట్టుకొని మెరిసిపోతున్నారు.
రెడ్ కలర్ లెహంగాలో షాలిని కనిపించగా, నితిన్ బ్లూ కలర్ కుర్తాలో కళ్లకు డిఫరెంట్ గాగూల్స్ పెట్టుకొని చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. కాగా, ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలు అమలులో ఉండటంతో పెళ్లి వేడుకను చాలా తక్కువ మంది అతిథుల సమక్షంలో జరపనున్నారు. కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, కొంత మంది స్నేహితులు మాత్రమే నితిన్-షాలిని పెళ్లికి హాజరుకానున్నారు.