ఇంకా పేరు పెట్టని నితిన్ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది !

Join Our Community
follow manalokam on social media

హీరో నితిన్ వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చెక్ అనే సినిమా చేస్తున్నాడు. ప్రియా వారియర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది. అయితే ఈయన మేర్లపాక గాంధీ తో కూడా ఓ సినిమా చేస్తున్నాడని గతంలో ప్రచారం జరిగింది. అయితే ఆ సినిమా ఏదో కూడా తెలియని పరిస్థితుల్లో ఏకంగా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా జూన్ 11వ తేదీన దేశ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. బాలీవుడ్ హిట్ సినిమా అందాదున్ రీమేక్ గా దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ మీద ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితారెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ఏ టైటిల్ పెడతారు అనే అంశం కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

TOP STORIES

చెప్పినట్టుగానే బీహార్ లో ఫ్రీ కరోనా వ్యాక్సిన్…!

బీహార్ ప్రభుత్వం ఫ్రీగా కరోనా వైరస్ వ్యాక్సిన్ ని అందిస్తోంది. బీహార్ స్టేట్ లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా వాక్సిన్ ఫ్రీ గా వేయడానికి...