నేడు “నీతి ఆయోగ్” 7వ “పాలక మండలి”సమావేశం.. కేసిఆర్, నితీశ్ గైర్హాజరు

-

ఇవాళ “నీతి ఆయోగ్” 7వ “పాలక మండలి” సమావేశం జరుగనుంది. ప్రధాని అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. పంట మార్పిడి, నూనె, పప్పు ధాన్యాల ఉత్పత్తి లో స్వావలంబన సాధించడం, “జాతీయ విద్యావిధానం” అమలు లో భాగంగా పాఠశాల, ఉన్నత విద్యా విధానం, పట్టణ, పుర పాలన లాంటి అంశాలే అజెండాగా ఈ సమావేశం జరుగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలకాంశాల పై చర్చలు జరుగనున్నాయి.

75 వ స్వాతంత్ర దినోత్సవాలను జరుపుకోబోతున్న ఈ సమయంలో, సమాఖ్య వ్యవస్థకు స్పూర్తిగా రాష్ట్రాలు మరింత శక్తివంతంగా, “ఆత్మ నిర్బర్ భారత్” ను ఆవిష్కరించే దిశగా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందని ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన లో వెల్లడించనున్నారు. ఈ ఏడాది జూన్ లో ధర్మశాలలో ప్రధాని అధ్యక్షతన రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల తో జరిగిన సమావేశంలో “అజెండా” పై చర్చ జరుగనుంది.

రాష్ట్రపతి భవన్ “కల్చరల్ సెంటర్” లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న సమావేశంలో G-20 సమావేశ వేదిక పై రాష్ట్రాలు తమ పురోగతిని ప్రదర్శించుకునే అవకాశమని అధికారిక ప్రకటన లో వెల్లడించనున్నారు. ఇక ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు, బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ గైర్హాజరు అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news