BREAKING : డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

-

BREAKING : డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పాలకొల్లులో టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల, ఎమ్మెల్సీ అంగర పట్ల వైసీపీ నేతలు దౌర్జన్యంగా వ్యవహరించరని లేఖలో ప్రస్తావించిన చంద్రబాబు…పెంకులపాడులో టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ లను వైసీపీ నేతలు అడ్డుకున్నారన్నారు. ఇద్దరు నేతలు వేదికపైకి వెళ్లకుండా అడ్డుకోవడమే కాకుండా వారిపై దాడి చేశారని.. ఈ దాడిలో కిందపడిన ఎమ్మెల్యే రామానాయుడు గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ నేతల దౌర్జన్యంపై అక్కడే ఉన్న డీఎస్పీ సహా పోలీసులు ఎవరూ స్పందించలేదని.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై దాడి జరుగుతున్నా పోలీసులు స్పందించకపోవడం విస్మయం కలిగించిందని తెలిపారు. టీడీపీ ప్రజా ప్రతినిధులకు సంబంధించి తీవ్రమైన ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరిగాయి.. పోలీసుల సమక్షంలోనే ఇద్దరు ప్రజా ప్రతినిధులకు రక్షణ లేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అని నిలదీశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి అలసత్వం ప్రదర్శించిన పోలీసులతో పాటు దాడికి పాల్పడిన వారిపై గూండాలపై చర్యలు తీసుకోవాలి… పోలీసులు సమర్థవంతంగా, నిజాయితీగా వ్యవహరించడం ద్వారా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news