తెలంగాణ ఆర్టీసీని గుర్తించడం లేదు.. గడ్కరీ వ్యాఖ్య‌లు..

-

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎస్‌ ఆర్టీసీ ఏర్పాటును తాము చట్టపరంగా గుర్తించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలిసింది. ఏపీఎస్‌ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కానందున టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటును తాము గుర్తించలేదంటూ ఆయన పేర్కొన్నట్లు సమాచారం.

సమ్మె వ్యవహారాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలంటూ సూచించారు. తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌ కేంద్రానికి రాసిన లేఖకు సమాధానంగా గడ్కరీ ఈ ప్రత్యుత్తరం రాసినట్లు తెలుస్తోంది. కాగా, కేంద్ర విధానం సమస్యను మళ్లీ మొదటికి తెచ్చింది. అసలు టిఎస్‌ఆర్టీసీ మనుగడనే ప్రశ్నించిన కేంద్రం వల్ల కార్మికుల సమ్మె, టిఎంయు ఉనికి కూడా ప్రశ్రార్థకమైంది. దీనివల్ల ఆర్టీసీపై తెలంగాణ ప్రభుత్వ అధికారాలు కూడా అయోమయంలో పడ్డాయి. కాగా, నేడు తలపెట్టిన ట్యాంక్‌బండ్‌ మార్చ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అంతటా ముందస్తు అరెస్టులు చోటుచేసుకున్నాయి. ఇందిరాపార్క్‌ దాకా చేరుకున్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. జేఏసీ నేత అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news