సినిమా ఎలా ఉన్నా ఆయన మాత్రం ఎక్కడా తగ్గరు. పెర్ఫార్మెన్స్ పరంగా ఎటువంటి రిమార్కులూ ఉండవు. ఆ మాటకు వస్తే మహేశ్ కానీ పవన్ కానీ తమ కష్టంలో లోటు ఏ రోజూ రానివ్వరు. ఆ విధంగా వాళ్లిద్దరూ ఒకే విధంగా సినిమా విషయమై ఆలోచిస్తారు. సినిమా బాగుంటే వంద కుటుంబాలు బాగుంటాయి అన్న నమ్మకం వాళ్లిద్దరికీ ఉంది. అందుకే ఇవాళ మహేశ్ సినిమా ఎన్నో విమర్శలు అందుకుంటున్నా కూడా మహేశ్ పరంగా ఒక్కటంటే ఒక్క విమర్శ లేదు.
ముందు సినిమాల కన్నా ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఫుల్ జోషలో ఉన్నారు. కథ పరంగా మంచి సందేశం సమ్మిళతం అయి ఉంది. కానీ ఎందుకనో డైరెక్టర్ తడబాటు ఇది. ఓ సినిమాను డిజాస్టర్ చేసేందుకు యాంటి ఫ్యాన్స్ ఏమయినా అదే పనిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారా అన్న వాదన కూడా వినవస్తోంది. అయినా కూడా మహేశ్ నటించిన అతడు పై కూడా విమర్శలు ఉన్నాయి. ఖలేజా కూడా మంచి సినిమానే ! అసలు ఆ మాటకు వస్తే అరవింద సమేత కన్నా అతడు సినిమానే త్రివిక్రమ్ బాగా తీశారు. ఇంకా చెప్పాలంటే ఆ సినిమాకు మాటలే ఆయువుపట్టు. అంతటి స్థాయిలో స్క్రిన్ రైటింగ్ తరువాత చేయలేకపోయారు ఆయన.
ఇక అసలు వివాదాన్నే తీసుకుందాం. ఎస్వీపీ (సర్కారు వారి పాట) కి ముందు నుంచి భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అదేం తప్పు కాదు. ఓ అభిమాని అప్పటిదాకా వరుస హిట్లు ఉన్న హీరో నుంచి ఆ పాటి కోరుకోవడం తప్పు కాదు. ఆ అంచనాలు మోసే బాధ్యత కూడా ఈ సినిమా విషయమై మహేశ్ తీసుకున్నారు. పరశు రామ్ కూడా మరీ పేలవమైన సన్నివేశాలు అయితే తీయలేదు.
కానీ ఫస్ట్ పార్ట్ ఎగ్జిక్యూషన్ బాలేదు. అదేవిధంగా అనవసరం అయిన సన్నివేశాలు కొన్ని తొలగించి ఉంటే బాగుండేది అన్న అభిప్రాయం ఉంది. గత చిత్రాలను పోలి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి అన్న మాట మాత్రం నిజం. కానీ సినిమాలో హైలెట్ చేసిన ఆర్థిక ప్రజాస్వామ్యం అన్న మాట అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ పాయింట్ ను మరికొంత ఎలివేట్ చేసి హైలెట్ చేసి ఉంటే బాగుండు..ఆ పాయింట్ ను కన్విన్స్ చేసిన తీరు ఇంకొంత బాగుండి ఉంటే బాగుండు.