తెలంగాణను కల్వకుంట్ల కుటుంబానికి రాసిచ్చామా…. ఎవరూ రాకూడదా..?: కిషన్ రెడ్డి

-

తెలంగాణను కల్వకుంట్ల కుటుంబానికి ఏమైనా రాసిచ్చామా..? తెలంగాణకు రావాలంటే కల్వకుంట్ల కుటుంబం పర్మిషన్‌ తీసుకోవాలా? తెలంగాణపై కల్వకుంట్ల కుటుంబానికి ఎంత హక్కుందో.. ఉద్యమకారులకు, బీజేపీకి అంతే హక్కుందని కిషన్ రెడ్డి విమర్శించారు. భారత హోంమంత్రి మీ పర్మిషన్ తీసుకొని తెలంగాణకు రావాలా..? అంటూ ప్రశ్నించారు. ఇదేం నిజాం రాజ్యం కాదని ఆయన అన్నారు. కేసీఆర్ అందుకే బాబా సాహెబ్ రాజ్యాంగం వద్దని కేసీఆర్ అంటున్నారని విమర్శించారు. బీజేపీ బారాబర్ తెలంగాణ రాష్ట్రానికి వస్తుందని ఆయన అన్నారు. ఈ రాష్ట్రంలో 1 లక్ష4 వేల కోట్ల రహదారులు మంజూరు చేశామని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు గత ఏడున్నర సంవత్సరాలుగా రూ. 30 వేల కోట్ల విలువైన ఉపాధి హమీ పనులకు డబ్బులు ఇచ్చామని… ప్రతీ గ్రామ పంచాయతీకి కేంద్రం డబ్బులు ఇచ్చిందని.. ప్రతీ పేదవాడికి వంట గ్యాస్ ఇచ్చామని… ప్రతీ పేదకుటుంబానికి మరుగుదొడ్డి కట్టించామని వీటన్నింటిని తెలిపేందుకే అమిత్ షా వచ్చారని కిషన్ రెడ్డి అన్నారు. ప్రతీ పేదవాడికి ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత బీజేపీదే అని కిషన్ రెడ్డి అన్నారు. దళిత ముఖ్యమంత్రి, ఇంటింటికి ఉద్యోగం, ఉచితంగా ఎరువులు ఇలా అనేక హామీలు ఇచ్చి కేసీఆర్ మోసం చేశారని కిషన్ రెడ్డి విమర్శించారు. గిరిజన రిజర్వేషన్ రాలేదంటే దానికి కారణం కల్వకుంట్ల ఫ్యామిలీనే కారణం అని ఆయన అన్నారు. గిరిజన రిజర్వేషన్లకు బీజేపీ కట్టుబడి ఉందని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news