ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేసి వాళ్ళను ఇంటర్ కి ప్రమోట్ చెయ్యాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు జరుగుతుంది.
అన్ని రకాల పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా కేసులు 13 కి చేరుకున్నాయి. వేలాది మందిని క్వారంటైన్ లో ఉంచింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు పరిక్షలు నిర్వహించే పరిస్థితి దాదాపు లేదనే చెప్పాలి. దీనితో ఆరు నుంచి 9 తరగతుల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పాస్ చేసింది. వాళ్ళను ఉన్నత తరగతులకు ప్రమోట్ చేసింది.
ఇప్పుడు అదే విధంగా పదో తరగతి విద్యార్ధులను కూడా పై తరగతులకు ప్రమోట్ చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీనిపై త్వరలోనే నిర్ణయం వెల్లడించే అవకాశాలు కనపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తో దీని గురించి ఒకసారి చర్చించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. శుక్రవారం జరిగిన కేబినేట్ సమావేశంలో జగన్ దీనిపై చర్చించినట్టు సమాచారం.