జగన్ మరో కీలక నిర్ణయం.. పేరెంట్స్ హ్యాపీ!

-

లాక్ డౌన్ కారణంగా అన్ని వ్యవస్థలతో పాటు విద్యారంగం కూడా ఆర్ధికంగా కుదేలవుతున్న సంగతి తెలిసిందే! అయితే… కరోనా వచ్చే టైం కే పరీక్షల కాలం వచ్చేసింది కాబట్టి… ఇప్పటికే మెజారిటీ స్కూల్లు, కాలేజీలు ఫీజులు చెల్లించేసుకునే ఉంటారు కాబట్టి.. మరీ అంత నష్టం ఏమీ ఉండదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో ఆదాయం మొత్తం శూన్యం అయిపోవడంతో.. విద్యార్థుల తల్లితండ్రులు కూడా ఫీజులు కట్టలేని పరిస్థితి! అయినా కూడా పలు స్కూల్ల యాజమాన్యాలు మాత్రం ఫీజులు కట్టాల్సిందే అంటూ తల్లితండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి! ఈ క్రమంలో ఈ నష్టాన్ని వచ్చే ఏడాది ఫీజులు పెంచడంతో పూడ్చుకుందామని కూడా కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ఆలోచిస్తున్నాయనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో జగన్ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.!

వచ్చే ఏడాది కూడా ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీ ఫీజులపై పాఠశాల విద్యాశాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుని, ఆదేశాలు జారీచేసింది. లాక్‌ డౌన్‌ సమయంలో ఫీజులు కట్టితీరాలనే నిబందనలు పెట్టొద్దని, విద్య్యార్థుల తల్లితండ్రులను ఇబ్బందులకు గురిచేయవద్దని ఏపీ సర్కార్ పేర్కొంది. ఇదే క్రమంలో పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో గత ఏడాది నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది. అలా అని మొత్తం ఫీజు ఒకేసారి తీసుకోవడమో.. కనీసం 60% ఫీజు కట్టాలని ఒత్తిడి చేయడమో చేయొద్దని ఆదేశాలు జారీచేసిండి!

ఇందులో భాగంగా… వచ్చే ఏడాది ఫీజుల్లో మొదటి త్రైమాసిక కాలం ఫీజు మాత్రమే వసూలు చేయాలని.. ఈ మేరకు విద్యా సంస్థల యాజమాన్యాలకు ఏపీ సర్కార్ సూచించింది! మొదటి త్రైమాసిక ఫీజును కూడా రెండు విడతలుగా వసూలు చేయాలని… ఆ రెండు విడతల్లో కూడా.. వాటి మధ్య కనీసం 45 రోజుల వ్యవధి ఉండాలని తెలిపింది. ఇదే సమయంలో… రానున్న విద్యా సంవత్సరంలో ఫీజులు పేరుతో ఎవ్వరికీ అడ్మిషన్లు తిరస్కరించడం వంటి పనులు చేయడం కానీ… ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేయడం కాని చేయకూడదని.. అలా చేసిన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తుంది ఏపీ సర్కార్. దీంతో ఈ కష్టకాలంలో తల్లితండ్రుల నోట్లో జగన్ సర్కార్ చక్కెర పోసినట్లయ్యిందని పలువురు అభిప్రాయపడుతున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news