ఇది దాడే.. మాపై కరోనాతో దాడి చేసారు… ట్రంప్ సంచలన వ్యాఖ్యలు…!

-

అమెరికాలో కరోనా వైరస్ కారణంగా దాదాపు 50 వేల మంది వరకు మరణించారు. ఇక దాదాపు 9 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. దీనితో దేశంలో లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు. ఈ దెబ్బకు పటిష్ట ఆర్ధిక వ్యవస్థ అయిన అమెరికా తీవ్రంగా నష్టపోతుంది. ఆ దేశం ఆర్థిక తిరోగమనాన్ని ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసారు. బుధవారం ఆయన వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు.

దేశం అప్పుల గురించి మాట్లాడినప్పుడు ఆయన తమ దేశం దాడికి గురైంది అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.తమపై కరోనా వైరస్ దాడి జరిగిందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. “మాపై దాడి జరిగింది. ఇది కచ్చితంగా దాడే. ఇది కేవలం ఫ్లూ మాత్రమే కాదు. ఇలాంటివి ఎవ్వరూ చూడలేదు, 1917లో చివరి సారి చూసారని అది స్పానిష్ ఫ్లూ అని అన్నారు. ప్రజలను వ్యాపార సంస్థలను ఆదుకోవడానికి గానూ ఆ దేశం బహుళ-ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించింది.

వాటి ఫలితంగా పెరుగుతున్న యుఎస్ అప్పుల గురించి ఒక ప్రశ్నకు గానూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. తమకు ఇప్పుడు మరో మార్గం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఉంటే మీరే చెప్పండి అని మీడియా ను ప్రశ్నించారు. తాను ఇప్పుడు ఆందోళనలో ఉన్నా అని ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు ట్రంప్. “ప్రపంచ చరిత్రలో మనకు గొప్ప ఆర్థిక వ్యవస్థ ఉంది. చైనా కంటే ఉత్తమం, అన్ని దేశాల కంటే మంచిది అని ఆయన వ్యాఖ్యానించారు. తాము గత మూడేళ్ళ లో దీనిని నిర్మించామని ఆయన వివరించారు.

తాము విమానయాన సంస్థలను సేవ్ చేసామన్నారు ట్రంప్. రెండు నెలల క్రితం వరకు వారు ఎంత గొప్పగా ఉన్నా సరే వాటిని ఇప్పుడు తాము కాపాడామని ఆయన వివరించారు. ఇప్పుడు పూర్తిగా మూతపడ్డాయని అన్నారు. దేశవ్యాప్తంగా కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూనే ఉందని ట్రంప్ అన్నారు. హాట్ స్పాట్ లు ఉన్న ప్రాంతాల్లో కరోనా కట్టడి అవుతుందని అన్నారు. బోస్టన్ ప్రాంతంలో కేసులు ఇప్పుడు తగ్గుతున్నాయని.. డెట్రాయిట్ గరిష్ట స్థాయిని దాటిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news