పరీక్షలు లేకుండానే ఇంటర్ పాస్.. తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు ?

-

తెలాంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులని పరీక్షలు లేకుండా పాస్‌ చేస్తే బాగుంటుందని విద్యా సంస్థల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, అధ్యాపకులు కోరుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ అంశం మీద ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్‌, విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చించి దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.

తాజాగా ఆమె ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీ యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతుగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఈ కామెంట్స్ చేశారు. అయితే ఇది ఎంతవరకు నిజం అవుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. అయితే అన్ని పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ పరీక్షలు కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. 

Read more RELATED
Recommended to you

Latest news