“ఈ రోజు ఎన్ని కార్లు ఉన్నా ఒకప్పుడు రోడ్లపై నడిచే రోజులు మర్చిపోగలమా..” మెగాస్టార్ మాటల్ని గుర్తుచేసుకున్న ఆలీ..

-

Entertainment టాలీవుడ్ లో కామెడీ అనగా తనదైన ముద్ర వేశారు ప్రముఖ హాస్య నటుడు ఆలీ కథానాయకుడిగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత బుల్లితెరపై హోస్ట్ గా మారారు.. ప్రతివారం ప్రముఖ సినీ రాజకీయ ప్రముఖులతో ఆలీతో జాలీగా కార్యక్రమాన్ని చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు అయితే తాజాగా జరిగిన ఈ కార్యక్రమానికి నటి తులసి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రభాస్ శీను వచ్చారు ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాన్ని చర్చించుకున్న వీరు.. మెగాస్టార్ చిరంజీవిని గుర్తు చేసుకున్నారు.. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం ఆయనలో ఉందని అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు అంటూ చెప్పుకొచ్చారు..

తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా మెగాస్టార్ స్థాయికి ఎదిగారని సామాన్యమైన కుటుంబంలో పుట్టి అంత ఎత్తుకు ఎదగాలి అంటే ఎంతో కష్టపడి రావాల్సిందే అని గుర్తు చేసుకున్నారు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో రామారావు, నాగేశ్వరరావు, కృష్ణం రాజు.. ఇలా ఎందరో ఎంతో కష్టపడి పైకి వచ్చారని.. అలాగే బాగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు మెగాస్టార్ కూడా ఒకరని అన్నారు.. ఓ రోజు చెన్నై లో ఖైదీ నెంబర్ 150 సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని వస్తున్న సమయంలో బండి మీద వస్తున్న నాకు ఎదురుగా బెంజ్ కార్ లో వస్తున్న మెగాస్టార్ కనిపించారు.. ఒక్కసారిగా ఆ రోడ్డు పైన మా ఇద్దరి దృష్టి పడింది .అది చూసిన మెగాస్టార్ “ఏంట్రా పాత రోజులు గుర్తు వస్తున్నాయి కదా.. గుర్తుందా ఇదే రోడ్ల పైన కదరా మనం నడిచాము.. ఈరోజు బెంజ్ కార్ లో తిరుగుతున్నాం.. ఏదైనా తలరాత.. ఆ దేవుడికి తెలుసు రా ఎవరికి ఏం ఇవ్వాలో..” అన్నారు.. అది చూసి నేను ఆశ్చర్యపోయా అంటే ఆయనకి ఇంకా ఆ రోజులు గుర్తున్నాయి ఎంత ఎత్తుకు ఎదిగిన గతాన్ని మర్చిపోని గొప్ప వ్యక్తిత్వం మెగాస్టార్ సొంతం అంటూ చెప్పుకొచ్చారు.. అలాగే సినీ ఇండస్ట్రీ అంటే అందరూ చాలా తేలికగా చూస్తారు.. అవకాశాలు రావడం, నటించడం పెద్ద విషయం కాదు అనుకుంటారు కానీ ఇక్కడికి వచ్చి పని చేస్తే తెలుస్తుంది వాళ్ళ కష్టమేంటో.. డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేయాలి ప్యాంటు తీయమంటే తీయాలి షర్టు తీయమంటే తీయాలి అంతమంది ముందు ఎలాంటి సిగ్గు లేకుండా నటించడం అంత తేలికైన విషయం కాదు అన్ని దాటుకొని వస్తేనే ఈరోజు ఇక్కడ ఇలా నిలబడగలుగుతాం.. అంటూ చెప్పుకొచ్చారు ఆలీ..

Read more RELATED
Recommended to you

Latest news