ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ ని కరోనా బాగా ఇబ్బంది పెడుతుంది. ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కరోనా ఏదోక రూపంలో సిఎం జగన్ కు దగ్గరగానే ఉంది. ఇటీవల పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. వారిలో కొందరు సిఎం జగన్ తో మాట్లాడారు, కలిసారు. సిఎం క్యాంపు ఆఫీస్ కి వచ్చారు. అందులో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఒకరు. కొందరు అధికారులు కూడా కరోనా బారిన పడ్డారు.
దీనితో అసలు సిఎం జగన్ ఇక నుంచి ఎవరిని తన వద్దకు రానీయవద్దు అని స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. అధికారులు కూడా ఏది అయినా మాట్లాడాలి అంటే తనతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడాలి అని, సిఎస్ ని కూడా తన వద్దకు రావొద్దు అని చెప్పారట. అటు సిఎస్ నీలం సహాని కూడా కరోనాతో కంగారు పడుతున్నారు. ఇటీవల కొందరు అధికారులు కరోన బారిన పడిన సంగతి తెలిసిందే.