నో ఫోన్ జోన్లుగా ఏపీ టెన్త్ పరీక్షా కేంద్రాలను..

-

ఆంధ్ర ప్రదేశ్ విద్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో పదో తరగతి పరీక్షకు చెందిన ప్రశ్న పత్రాలు.. వరుసగా లీక్ అవుతుండడంతో.. పదో తరగతి పరీక్షా కేంద్రాలను నో-ఫోన్ జోన్లుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ విద్యా శాఖ. పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్, మాస్ కాపీయింగ్ లాంటి ఘటనలు చోటుచేసుకోకుండా అరికట్టేందుకు ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు విద్యా శాఖ తెలిపింది.

ఫోన్లు సహా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఏమైనా పరీక్షా కేంద్రాల్లో కన్పిస్తే వెంటనే జప్తు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది విద్యాశాఖ. స్మార్ట్ వాచ్, ఇయర్ ఫోన్లు, ఐపాడ్లు కూడా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేదే లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. క్వశ్చన్ పేపర్లోని ప్రతి పేజీ మీద సెంటర్ నెంబర్, రోల్ నెంబర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇన్విజిలెటర్లకు ఆదేశాలు జారీ చేసింది విద్యాశాఖ. ప్రశ్నాపత్రాలు ఇవ్వగానే అభ్యర్థులతో సెంటర్ నెంబర్, రోల్ నెంబర్ రాయించాలని, పరీక్ష నిర్వహణలో ఎవరైనా తప్పిదాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Latest news