వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రైతులకు కేంద్ర ప్రభుత్వం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. రైతు ఉద్యమంలో మరణించిన రైతుల సమాచారం లేదని… వారికి పరిహారం ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటన చేశారు. ఈ మేరకు పార్లమెంట్‌కు రాత పూర్వక సమాధానం ఇచ్చారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.
రైతుల మరణాలు, నిరసనల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం, వారిపై నమోదైన కేసులు వంటి విషయాలపై కేంద్రాన్ని ప్రశ్నించాయి విపక్షాలు. ప్రభుత్వం వద్ద తగిన సమాచారం లేదని.. అలాంటప్పుడు సహాయం అనే దానికి తావే లేదని.. ఈ సందర్భంగా స్పష్టం చేసారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్. కాగా ఇటీవల రైతు ఉద్యమం లో చనిపోయిన 750 మంది కి రూ. 3 లక్షల చొప్పున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.