అమెరికాలో 13 ఏళ్ల పిల్లలకు సోషల్ మీడియా ఎంట్రీ బ్యాన్ !

-

ప్రపంచం అంతటా సోషల్ మీడియా ప్రభావం ఏ విధంగా ఉందో చూస్తున్నాము. వయసుతో సంబంధం లేకుండా అందరూ సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. ఇదే తమ జీవిత లక్ష్యంగా 24 /7 అందులోనే ఉంటున్నారు. దీని వలన పిల్ల ఆరోగ్యం, భవిష్యత్తు అన్నీ పాడవుతున్నాయి, దీనిని సమగ్రంగా ఆలోచించిన అమెరికా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేయడానికి సిద్ధమైంది. 13 సంవత్సరాల పిల్లలు ఈ సోషల్ మీడియాను వాడకుండా ఉండేలాగా ఒక బిల్లును యూఎస్ సెనేట్ లో ప్రవేశ పెట్టారు. ఇది కనుక పాస్ అయితే 13 సంవత్సరాల పిల్లలు పేస్ బుక్, ఇంస్టా గ్రామ్, టిక్ టాక్ లాంటి సోషల్ మీడియా యాప్ లను వాడే అవకాశం ఉండదు.

తద్వారా వారి మానసిక ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా సక్సెస్ అయితే ప్రపంచం అంతటా ఈ పాలసీని అమలు చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news