రాహుల్ గాంధీ ప్రచారం చేసిన చోట బీజేపీదే గెలుపు: కర్ణాటక సీఎం

-

మే నెల రెండవ వారంలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలో ఓటర్లను ఆకట్టుకునే పనిలో బిజీ గా ఉన్నారు. ఈ సందర్భంగా జోరుగా ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి, బీజేపీ నాయకులు కాంగ్రెస్ మీద మరియు కాంగ్రెస్ నాయకులు బీజేపీ మీద కామెంట్లు చేసుకుంటూ ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నారు. తాజాగా కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అధిక ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. ఈయన ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్  గాంధీ ప్రచారం చేసిన చోటల్లా బీజేపీ విజయాన్ని సాధిస్తుంది అన్నారు.

ఇంకా ప్రియాంక గాంధీని ఉద్దేశించి సైతం వ్యాఖ్యలు చేయడం విశేషం, ఈమె ఎక్కడ అడుగుపడితే అక్కడ కాంగ్రెస్ ఓటమి ఖాయం అని చెప్పారు. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎవరు అధికర్మలోకి వస్తారన్నది సస్పెన్స్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news