ఒకవైపు చంద్రబాబు నాయుడు మళ్లీ భారతీయ జనతా పార్టీ చెంత చేరడానికి సిద్ధమైనట్టు సంకేతాలు వదులుతున్నారు. అయితే ఆ ఆపార్టీ నేతలు మాత్రం మళ్లీ చంద్రబాబును బీజేపీ చెంత చేరనిచ్చే ప్రశక్తేలేదని కుండబద్దలు కొట్టేస్తున్నారు. ఎన్నికలకు ముందు వరకు మోదీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడంతో పాటు మోదీని ఓడించాలని దేశవ్యాప్తంగా తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు మాత్రం మోదీతో తనకు వ్యక్తిగత విబేధాలు లేవని చెప్పుకుంటున్నారు.
అదే బాబు నిన్నమొన్నటి వరకు మోదీని మళ్లీ ప్రధానిని కానీయకూడదంటూ చాలా హంగామానే చేశారు. అనేక రాష్ట్రాలకు తిరిగారు. వివిధ పార్టీల వాళ్లను కలిశారు… ఇలా ఎంత రాజకీయం చేశారో చూశాం. ఈ క్రమంలోనే యూ టర్న్ అంకుల్‌గా ముద్రపడ్డ బాబు మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. కేంద్రంతో విబేధించి తీవ్రంగా నష్టపోయామని తమ పార్టీ అంతరంగీక చర్చల్లో చెప్పుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ ను తిట్టాలంటూ తన పార్టీ వాళ్లకు కూడా ఆదేశాలిచ్చారన్న టాక్ కూడా బయటకు వచ్చింది.
అంటే కాంగ్రెస్‌ను తిట్టడం ద్వారా మళ్లీ బీజేపీకి దగ్గరయ్యేందుకు రెడీగా ఉన్నామన్న సానుకూల సంకేతాలు ఇవ్వడమే బాబు టార్గెట్. బాబు గిమ్మిక్కులు ఎలా ? ఉన్నా బీజేపీ హై కమాండ్ మాత్రం చంద్రబాబు మీద కన్నేసిందట. బాబు ఎన్నికలకు ముందు వరకు వేసిన వేషాలను ఢిల్లీలోని కమలనాథులు ఎప్పటకి మర్చిపోయే ప్రశక్తే లేదట. అమిత్ షా, మోదీ ఇద్దరు బాబు విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.
ముందుగా తెలంగాణలో వచ్చే ఎన్నికలకే వీలుంటే అధికారంలోకి రావడం లేదా కాంగ్రెస్ ప్లేస్‌లోకి వచ్చేయాలని టార్గెట్‌గా పెట్టుకోగా… ఇప్పుడు ఏపీలో కూడా టీడీపీని అడ్డంగా తొక్కేసి… వచ్చే ఎన్నికల నాటికి బలం పుంజుకునే దిశగా వెళ్లాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ముందు ఏపీలో మన టార్గెట్ వైసీపీ కాదని…. టీడీపీని పూర్తిగా నాశనం చేసి… ఆ తర్వాత ఆ ప్లేస్లోకి ఎంట్రీ ఇచ్చి వైసీపీని ఢీ కొట్టాలన్నదే కాషాయ దళం ప్లాన్‌గా తెలుస్తోంది. అందుకే మిగిలిన పార్టీలను పక్కన పెట్టి బాబును, టీడీపీని టార్గెట్ చేయండని ఏపీ బీజేపీ నేతలకు ఇప్పటికే ఆదేశాలు వచ్చాయంటున్నారు. టీడీపీని పూర్తిగా అణగదొక్కితేనే ఏపీలో బీజేపీ పుంజుకుంటుందని… అందుకే ముందు టీడీపీని దెబ్బతీయాలని ఆదేశాలు వచ్చాయట.