పండుగ సీజన్‌లో డయాబెటిస్‌ కంట్రోల్‌!

-

దీపావళి పండుగంటే ఇష్టముండని వారుండరు. ఇంట్లో కొత్తరకాల వంటలతో గుమగుమలాడుతుంటుంది. ఇంట్లో చేసుకోవడమే కాకుండా ఆఫీసుల్లో కూడా స్వీట్ల రుచి చూపిస్తారు. మరి అలాంటి సమయాల్లో స్వీట్లు తినకుండా ఉండగలరా? మరి డమాబెటిస్‌ వారి పరిస్థితేంటి? వారు ఎదుటివారు తింటుండగా చూసి ఆస్వాదించాల్సిదేనా అనుకుంటారు. అలాంటి వారికి కూడా ఓ మార్గముంది. అదేంటి తెలుసుకోండి మరి.

దసరా వెళ్లిపోయింది. దీపావళి వచ్చేస్తోంది. బంధువులు, స్నేహితులతో వేడుకలు జరిగే సీజన్‌. పార్టీల్లో స్వీట్లు పంచుకోవడం, కూల్‌డ్రింక్స్‌ తాగడం కామన్‌. నలుగురితో ఉన్నప్పుడు స్వీట్లు తినకుండా ఉంటే బాగోదు కదా అని తింటుంటారు చాలామంది. అయితే డయాబెటిస్‌ ఉన్నవారికి ఇది సమస్యే. వారు ఎప్పటికపుపడు బ్లడ్‌లో షుగర్‌ లెవల్స్‌ చేసుకుంటూ ఉండాలి. అందుకోసం డైట్‌ కంట్రోల్‌ చేసుకుంటుండాలి. స్వీట్ల వంటి వాటిని చిన్న మొత్తాల్లో మాత్రమే తీసుకోవాలి. లేదంటే బాడీలో ఇన్సులిన్‌ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీని ఉత్పత్తి తగ్గితే.. రక్తంలో గ్లూకోజ్‌ లెవెల్స్‌ పెరిగిపోతాయి. అలా పెరిగిపోతే.. బాడీలో వివిధ విభాగాలు సరిగా పనిచెయ్యవు. అది చాలా రిస్‌కతో కూడిన వ్యవహారం. అందువల్ల డయాబెటిస్‌ ఉన్నవారు పండుగ సీజన్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

– సంప్రదాయ చివ్డా (chivda) బదులు… బ్రౌన్‌ రైస్‌ పోహాతో చేసుకుంటే మేలు.
– దీపావళికి సరికొత్తగా పప్పుతో చేసిన ఛకాలీ, కడ్బోలీ వంటివి చేసుకోండి.
– షుగర్‌ ఐటెమ్స్‌ బదులు.. సాల్ట్‌తో చేసిన చిరుతిళ్లు తీసుకోండి. ఫ్లేవర్‌ కోసం పాలక్‌, కొత్తిమీర వంటివి యాడ్‌ చెయ్యండి.
– మైదా, షుగర్‌ వంటివి వాడకుండా ఉండడం లేదు. వాటి బదులు జొన్నపిండి, రాగిపిండి వంటివి వాడండి.
– బేసిన్‌ లడ్డూ తినాలనిపిస్తే.. దాన్ని చక్కెర బదులు.. ఖర్భూజాలు, తేనెతో తయారుచేసుకోండి. అది మీకు మేలు చేస్తుంది.
– లడ్డూలను వేరుశనగ గింజలు, డ్రైఫ్రూట్లతో కూడా చేసుకోవచ్చు.
– పండుగ రోజుల్లో నెయ్యి బదులు.. కొబ్బరినూనె లేదా వేరుశనగ నూనె వాడవచ్చు.

ఎంత తినాలి :
స్వీట్లు తినవచ్చు కానీ వాటిని చిన్న మోతాదులో మాత్రమే తినాలి. ఒకట్రెండు ముక్కలు స్వీట్లు తిని, మిగతావి ఉప్పుతో చేసిన చిరుతిళ్లు తింటే.. మనసుకు హాయిగా ఉంటుంది. ఏవి తిన్నా భోజనం తర్వాతే తినాలి. అందువల్ల ఎక్కువ తినే అవసరం ఉండదు. అలాగే సాయంత్రం 6 తర్వాత తింటే మేలు. ఎందుకంటే ఆ సమయం తర్వాత నుంచి జీర్ణవ్యవస్థ నెమ్మదిస్తుంది. ఫలితంగా లెవెల్స్‌ ఒక్కసారిగా పెరుగవు.

డయాబెటిస్‌ ఉన్నవారు కూడా బ్లడ్‌షుగర్‌ లెవెల్స్‌ నార్మల్‌గా ఉన్నప్పుడు, కంట్రోల్‌లో ఉన్నప్పుడు.. షుగర్‌, స్వీట్ల వంటివి తినొచ్చు. కంట్రోల్‌లో లేనప్పుడు మాత్రం షుగర్‌కి దూరంగా ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news