నేడు దేశం దృష్టి మొత్తం నోయిడాలోని ట్విన్ టవర్స్ పైనే ఉంది. 100 మీటర్ల పొడవైన, 40 అంతస్తుల సూపర్ టెక్ ట్విన్ టవర్స్ ఆదివారం మధ్యాహ్నం ఒక్క పెట్టున నేలమట్టం కానున్నాయి. కేవలం 15 సెకండ్లలోనే ఇవి పేకమేడల్లా కూలిపోనున్నాయి.
తొమ్మిదేళ్లుగా పనులు కొనసాగిన ఈ టవర్స్ నిర్మాణానికి నిర్మాణ సంస్థ రూ.10 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు ఈ టవర్స్ ను కూల్చివేసేందుకు రూ.20 కోట్లు ఖర్చవుతుంది. వీటిని కూల్చేందుకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను అమర్చారు.
కూల్చివేత తర్వాత 80,000 టన్నుల వ్యర్ధాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. వీటిలో 50,000 టన్నుల వ్యర్ధాలను ఈ జంట భవనాలు ఉన్న ప్రాంతంలోనే భారీ గోతిలో నిర్వీర్యం చేసేందుకు ఏర్పాట్లు చేయగా, మిగిలిన 30 వేల టన్నుల వ్యర్ధాలను వేరే చోటకు తరలించి, సాంకేతికంగా ప్రాసెస్ చేయించి వాటి నుంచి టైల్స్ తయారు చేయనున్నారు.