Nora Fatehi: ‘పుష్ప’ హాట్ అప్డేట్..ఐటెంసాంగ్ లో హాట్ క్వీన్ నోరా ఫతేహి!!

-

Nora Fatehi: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్ట‌ర్ సుకుమార్ ల క్రేజీ కాంబినేషన్‌లో వస్తోన్ సినిమా ‘పుష్ప’. ఫాన్ ఇండియా మూవీగా తెరకెక్కించ‌బోతున్న‌.. ఈ సినిమాను రెండు భాగాలుగా రానున్నది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 17న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రెండో భాగం వచ్చే ఏడాది చివర్లో విడుదల చేయాలని చిత్రయూనిట్‌ భావిస్తోంది.

ఈ చిత్రంలో బ‌న్నీ స‌ర‌స‌న టాలీవుడ్ ముద్దుగుమ్మ ర‌స్మిక మంద‌నా న‌టించ‌నున్న‌ది. ఈ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడుగా మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్ న‌టిస్తుండ‌గా.. యాంకర్‌ అనసూయ కీల‌క‌ పాత్రలో న‌టించ‌నున్న‌ది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ (డీఎస్పీ) సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా వుంటే.. బన్నీ, డీఎస్పీ, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెర‌కెక్కితున్న చిత్రం కావున‌.. ఐటం సాంగ్ త‌ప్ప‌నిస‌రి. గ‌తంలో వీరి కాంబినేష‌న్లో వ‌చ్చిన ఐటం సాంగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అంద‌రికి తెలుసు. ఇప్ప‌టికీ ఎప్పటికీ ఎవ‌ర్ గ్రీనే.. ఆ స్థాయిని మించి ఉండేలా.. పుష్పలో ఓ ఐటం సాంగ్‌ కంపోజ్‌ చేస్తున్నాడట మ్యూజిక్ మంత్రికుడు డీఎస్పీ.

ఈ ఐటం సాంగ్ లో బన్నీతో స్టెప్పులేయడానికి.. హాట్ బ్యూటీ కోసం చూస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే దిశాపటానీ, ఊర్వశి రౌతేలా, మాజీ పోర్న్‌ స్టార్‌, బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌ను ఐటం సాంగ్‌ కోసం సంప్ర‌దించార‌ట‌. కానీ, వీరు సానుకులంగా లేక‌పోవ‌డంతో ఫారిన్ హాట్ క్వీన్ నోరా ఫతేహి సంప్రదించినట్లు ఫిల్మీదునియాలో టాక్‌ వినిపిస్తోంది. ఇంక అధికారిక ప్ర‌కట‌న రాలేదు.

హాట్ బ్యూటీ నోరా ఫతేహి గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె డ్యాన్సర్‌, మోడల్‌, సింగర్‌​, నటి, రియలిటీ షోకు జడ్జిగా.. ఇలా అన్ని రంగాల్లో ఇప్పటికే తనదైన ముద్ర వేసుకుంది. టాలీవుడ్‌లో టెంపర్‌, కిక్‌2, లోఫర్‌, ఊపిరి చిత్రాల్లో ఆడిపాడిన నోరా.. ప్రభాస్‌ నటించిన బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ మెప్పించింది. ఈ అమ్మ‌డు ఓకే చెప్పే.. ఈ ఐటెం సాంగ్ ఎంత హాట్ గా షూట్ చేస్తారో చెప్పావ‌ల్సిన అవ‌స‌రం లేదు. ఇక బ‌న్నీ ప్రేక్ష‌కుల‌కు పండుగే పండుగ‌.

 

Read more RELATED
Recommended to you

Latest news